సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్నారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతుండటంతో కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఆసుపత్రి ఖర్చులు ఇతర అవసరాల దృష్ట్యా డబ్బులు ఖర్చు అవ్వడంతో కందికొండ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కాగా తాజాగా కందికొండ కూతురు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు తమను ఆదుకోవాలని లేఖ రాశారు. ఈ లేఖలో తండ్రి అనారోగ్యం… ఆసుపత్రిలో చికిత్స కారణంగా తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో తాము ఉన్నామని చెప్పారు. తమకు చిత్రపురి కాలనీ లో లేదంటే ఏదైనా ప్రదేశంలో ఇల్లు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతూ లేఖ రాశారు. దాంతో కేటీఆర్ కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని… ఇప్పుడు ఎప్పుడూ అండగా ఉంటామని కందికొండ కూతురుకు హామీ ఇచ్చారు. ఫ్యామిలీ విషయంలో తన ఆఫీసు సిబ్బంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మాట్లాడి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కందికొండ ఎన్నో సూపర్ హిట్ పాటలను రచించారు. ఆయన మొదటిసారిగా టాలీవుడ్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో మల్లి కూయవే గువ్వా అనే పాట ను రచించారు. అంతేకాకుండా పోకిరి సినిమా లో గల గల పారుతున్న సెలయేరులా అనే పాటను సైతం రాశారు.
Advertisement
Advertisement
ఇడియట్ సినిమా లో చూపుల్తో గుచ్చి గుచ్చి అనే పాటను కూడా కందికొండనే రచించారు. అదేవిధంగా లవ్లీ సినిమా లో లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ అనే పాటను కూడా ఆయన రచించారు. అలా ఎన్నో యూత్ ఫుల్ పాటలు రచించి కండికొండ ప్రముఖ రచయిత గా పేరు తెచ్చుకున్నారు. కేవలం సినిమా పాటలు కాకుండా తెలంగాణ సంస్కృతికి సంబంధించి, బతుకమ్మ గురించి ఆయన రాసిన పాటలు శ్రోతలను అలరించారు. చివరగా కందికొండ నీది నాది ఒకే కథ సినిమా కు రెండు పాటలు రాసారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం బారిన పడ్డారు.