Home » మా రాష్ట్రానికి రండి….ఎలాన్ మస్క్ కు మంత్రి కేటీఆర్ ఆహ్వానం…!

మా రాష్ట్రానికి రండి….ఎలాన్ మస్క్ కు మంత్రి కేటీఆర్ ఆహ్వానం…!

by AJAY
Ad

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కంపెనీతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తీసుకువచ్చేందుకు సవాళ్లు ఉన్నాయని ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Advertisement

దాంతో కేటీఆర్ ఆ పోస్ట్ పై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుందని తెలిపారు. భారతదేశంలో వ్యాపారాలకు అనుగుణంగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో అమెరికాకు వెళ్లిన సందర్భంగా టెస్లా కార్ తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఇది ఇలా ఉంటే టెస్లా కంపెనీ గతంలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కోరింది.

Advertisement

కానీ ముందు విద్యుత్ కార్ల ఉత్పత్తి దేశీయంగా ప్రారంభించాలని భారీ పరిశ్రమల శాఖ సూచించింది. రాయితీలు ఇతర సంస్థలకు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పన్ను మినహాయింపు ఇస్తే ఇతర కంపెనీలకు కూడా మంచి సంకేతాలు వెళ్లవు అని పరిశ్రమల శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది. కానీ కేటీఆర్ కేంద్రానికి షాక్ ఇస్తూ మా రాష్ట్రానికి రండి నేను తెలంగాణ కు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading