Home » KTR: జూన్ 2 దాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌‌.. తర్వాత‌ కేంద్ర పాలిత ప్రాంతం..!

KTR: జూన్ 2 దాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌‌.. తర్వాత‌ కేంద్ర పాలిత ప్రాంతం..!

by Sravya
Ad

KTR: తెలంగాణ లోని లోక్ సభ ఎన్నికల వేడి బాగా పెరిగిపోతూ వస్తోంది. ప్రచారంలో జోరు పెరిగింది. నేతల మాటలు కూడా హీటెక్కిస్తున్నాయి. అయితే ఈ క్రమం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాది జూన్ రెండు దాకా హైదరాబాద్ నగరం తెలంగాణ ఏపీ రాష్ట్రల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తర్వాత కాంగ్రెస్ బిజెపి కలిసి హైదరాబాద్ నీకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని కీలక కామెంట్లు చూశారు.

Advertisement

 

హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని కేటీఆర్ అన్నారు. బిజెపి అరాచకాలని అడ్డుకోవడానికి శక్తి కేవలం బీఆర్ఎస్ కి మాత్రమే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇందుకు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

Advertisement

Also read:

Also read:

2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తెలంగాణకి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపడానికి పవర్ కేవలం బీఆర్ఎస్ కి మాత్రమే ఉందన్నారు. ఏడాది లోగా తెలంగాణని మళ్లీ కేసీఆర్ శాసించే రోజులు రావాలి అంటే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు లో బీఆర్ఎస్ ని గెలిపించాలని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading