Home » రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన కేటీఆర్.. ఏంటంటే..!!

రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన కేటీఆర్.. ఏంటంటే..!!

Ad

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల నాయకులు వివిధ రకాలుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవైపు టిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఇంకో వైపు బిజెపి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల మనసును దోచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరై వివిధ హామీలను గుప్పించారు. వీటిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన సమయంలో ఏడు దశాబ్దాలు వ్యవసాయాన్ని పాతర పెట్టారని అన్నారు.

Advertisement

2014లో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వరి ధాన్యం 45 లక్షల టన్నులు పండిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరి పంట పండు తోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 24 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఒక్క టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ హయాంలో 16 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. దీనికి సంబంధించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని, దేశంలోనే అతి తక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కేటీఆర్ అన్నారు. నిన్న జరిగినది రైతు సంఘర్షణ సభ కాదని అన్నారు. ఏ ఐ సి సి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని, ఆలిండియా క్రైసిస్ కమిటీ అని విమర్శించారు. మొన్నటివరకు పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తరిమికొట్టారని ఎద్దేవా చేశారు. ముందుగా చత్తీస్గడ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతుబంధు, రుణమాఫీ అమలు చేసి ఈ మాటలు మాట్లాడాలని అన్నారు.

Visitors Are Also Reading