Home » ఆ త‌ప్పు వ‌ల్ల కృతిశెట్టి టాలీవుడ్ కు దూరం కానుందా..? ఆ త‌ప్పు ఏంటంటే..?

ఆ త‌ప్పు వ‌ల్ల కృతిశెట్టి టాలీవుడ్ కు దూరం కానుందా..? ఆ త‌ప్పు ఏంటంటే..?

by AJAY
Ad

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టికే ప‌లు పాపులార్ బ్రాండ్ ల‌కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. అంతే కాకుండా కృతి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ప‌లు చిత్రాల‌లో న‌టించింది. కానీ ఉప్పెన సినిమాతో మొద‌టిసారి హీరోయిన్ ఆఫ‌ర్ అందుకుంది. అంతే కాకుండా ఉప్పెన సినిమా విడుద‌ల కాక‌ముందే సినిమా ట్రైల‌ర్ లో మరియు సాంగ్స్ లో త‌న క్యూట్ లుక్స్ కొంటె న‌వ్వుల‌తో కుర్రాళ్ల మ‌న‌సు దోచుకుంది.

kruthishetty

kruthishetty

దాంతో ఉప్పెన సినిమా విడుద‌ల కాకముందే ప‌లు ప్రాజెక్టుల‌కు కృతిశెట్టి సైన్ చేసింది. ఇక ఉప్పెన సినిమా త‌ర‌వాత కృతి శెట్టి వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. అయితే శ్యామ్ సింగ‌రాయ్, బంగార్రాజు సినిమాల‌తో వ‌రుస హిట్ ల‌ను అందుకుంది. కానీ ఆ త‌రవాత మాత్రం కృతికి బ్యాడ్ టైమ్ మొద‌ల‌య్యింది.

Advertisement

Advertisement

Kruthi shetty

Kruthi shetty

క‌థ‌ల ఎంపిక‌లో చేస్తున్న త‌ప్పుల వ‌ల్ల వ‌రుస ఫ్లాప్ లు ప‌డుతున్నాయి. నిజానికి ఇండ‌స్ట్రీలో హిట్ లు ప‌డినంత కాల‌మే ఆఫ‌ర్ లు వ‌స్తుంటాయి. ఒక్క సారి ఫ్లాప్ లు మొద‌లైతే ఆ తర‌వాత ఎంత‌ప్ర‌య‌త్నించినా ఆఫ‌ర్ లు రావ‌డం చాలా క‌ష్టం. కృతి శెట్టి న‌టించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఫ్లాప్ అయ్యింది.

అంతే కాకుండా నితిన్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అంతేకాకుండా రామ్ హీరోగా న‌టించిన దివారియర్ సినిమాలోనూ కృతి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇలా వ‌రుస‌గా కృతిశెట్టి వ‌రుస ఫ్లాప్ ల‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో క‌థ‌ల ఎంపిక‌లో చేస్తున్న త‌ప్పుల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి దూరం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading