Home » త్వరలో కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్… ? అఫీషియల్ అంటూ కన్ఫామ్ చేశాడుగా…!

త్వరలో కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్… ? అఫీషియల్ అంటూ కన్ఫామ్ చేశాడుగా…!

by AJAY
Ad

టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో హీరో ప్రభాస్ హీరోయిన్ కృతిసనన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ కృతిస నన్ కలిసి ఆది పురుష్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ మాట్లాడుతూ ….ప్రభాస్ ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటా… అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. దాంతో ఇద్దరి రిలేషన్షిప్ పై ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన బిడియాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ జోహార్ షో కు హాజరయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. దాంతో కృతి కూడా షోలో పాల్గొంది. అయితే ఈ షోలో కరన్ జోహార్ వరుణ్ ధావన్ ను నీ లిస్టులో కృతి ఎందుకు లేదు..? అంటూ ప్రశ్నించాడు.

Advertisement

దానికి వరుణ్ ధావన్ సమాధానం ఇస్తూ… ఆమె మరొకరి హృదయంలో ఉంది అంటూ చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి ఎవరు అని కరణ్ జోహార్ అడగగా….. ప్రస్తుతం అతడు దీపికా పదుకునేతో షూటింగ్ లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ దీపిక పదుకునేతో కలిసి ప్రాజెక్టు కే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభాస్ కృతి సనన్ రిలేషన్షిప్ నిజమే అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు దుబాయ్ లో ఉండి సినిమా రివ్యూలు ఇచ్చే ఉమైర్ సాదు ఓ ట్వీట్ చేశాడు. తన ట్వీట్ లో ఉమై ర్ సాధు… ఆధిపురుష్ సినిమా షూటింగ్లో కృత్రిసనన్ చూపిన కేరింగ్ చూసి ప్రభాస్ పడిపోయాడని…. దాంతో ఆమెకు ప్రపోజ్ చేశాడని త్వరలోనే ఇద్దరి నిశ్చితార్థం జరుగుతుందని ప్రకటించాడు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading