Home » స్టార్ హీరో రాసిన లేఖ‌ను ఫ్రేమ్ క‌ట్టించుకున్న కృతిశెట్టి..!

స్టార్ హీరో రాసిన లేఖ‌ను ఫ్రేమ్ క‌ట్టించుకున్న కృతిశెట్టి..!

by Anji

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రంతో ఎంట్రి ఇచ్చింది హీరోయిన్ కృతిశెట్టి. త‌న తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకోడంతో పాటు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ఇక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో దూసుకుపోతుంది. కృతిశెట్టి న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇటీవ‌ల శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో అద్భుతంగా న‌టించి ఆడియ‌న్స్‌ను మెప్పించింది ఈ బ్యూటీ.

Krithi Shetty: Babamma who cries without glycerin .. Kriti Shetty Interesting Comments .. | Krithi shetty says about bangarraju movie and her professional life | pipanews.com

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా వ‌చ్చిన బంగార్రాజుతో క‌లిసి థియేట‌ర్ లో సంద‌డి చేసింది. అలీతో స‌ర‌దాగా షోకు డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌తో క‌లిసి వ‌చ్చిన కృతి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌నే వెల్ల‌డించింది. తాను మొద‌ట యాడ్ షూట్స్ చేస్తూ.. నెమ్మ‌దిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్టు చెప్పింది. త‌న మొద‌టి సినిమా ఉప్పెన స‌క్సెస్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనిద‌ని చెప్పుకొచ్చింది.

Chiranjeevi Calls Krithi Shetty a Born Star!

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌న గురించి చిరంజీవి గారు మాట్లాడ‌టం బిగ్ బ‌హుమ‌తి అనిపించింద‌ని వెల్ల‌డించింది. కానీ సినిమా విడుద‌ల‌య్యాక మ‌ళ్లీ ఆయ‌న ఒక గిప్ట్ పంపించారు అని తెలిపింది. త‌న చేతితో రాసిన ఓ లేఖ గిఫ్ట్‌ను చిరంజీవి పంపారు. అందులో యూఆర్ఏ బోర్న్ స్టార్ అని రాసార‌ని.. అందుకే ఆ లేఖ‌ను ప్రేమ్ కట్టించి భ‌ద్రంగా దాచుకున్నాను అని కృతిశెట్టి వెల్ల‌డించింది. మెగాస్గార్ మెచ్చుకోవ‌డం చాలా గొప్ప‌గా ఫీల్ అయ్యాన‌ని చెప్పింది కృతిశెట్టి. అదేవిధంగా త‌న‌కు రామ్‌చ‌ర‌ణ్ అంటే ఇష్టం అని రంగ‌స్థ‌లం సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ చేసిన క్యారెక్ట‌ర్ చాలా బాగా న‌చ్చింద‌ని.. అవ‌కాశం దొరికితే రామ్‌చ‌ర‌ణ్ తో న‌టించాల‌ని ఉన్న‌ద‌ని చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading