Home » అన్నదమ్ములకు హీరోయిన్ గా కృతి శెట్టి..?

అన్నదమ్ములకు హీరోయిన్ గా కృతి శెట్టి..?

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లలో కృతి శెట్టి ఒక్కరు. ఈ అమ్మడికి మొదటి సినిమా ఉప్పెన వల్ల వచ్చిన క్రేజ్ అనేది ఇంకా తగ్గడం లేదు. ఆ ఒక్క సినిమా వల్ల సినిమా అవకాశాలు కూడా ఉప్పెనల కృతి శెట్టి ముందుకు వస్తున్నాయి. అయితే ఉప్పెన సినిమా తర్వాత రెండు హిట్ సినిమాలు మాత్రమే చేసిన కృతి శెట్టి.. ఈ మధ్యే చేస్తున్న అన్ని సినిమాలు ప్లాప్స్ గా మిగిలిపోతున్నాయి.
అయిన కూడా కృతి శెట్టికి ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇన్ని ప్లాప్స్ మధ్యలో కూడా రెమ్యునరేషన్ అనేది పెంచిన ఈ బీబమ్మ ఇప్పుడు అన్నదమ్ములకు ఇద్దరికి హీరోయిన్ గా చేయబోతుంది అని తెలుస్తుంది. అయితే తమిళ్ హీరోలు అయిన సూర్య, కార్తీ ఇద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ అనేది ఉంది అనేది అందరికి తెలిసిందే.
ఇప్పుడు కృతి శెట్టి ఈ అన్నదములతోనే సినిమా అనేది చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో సూర్యకు జంటగా ఓ సినిమా ఒప్పుకుంది కృతి శెట్టి. కానీ ఆ సినిమా మధ్యలో ఆగిపోయి.. ఇప్పుడు మల్లి ప్రారంభం అయ్యింది. అలాగే ప్రస్తుతం కార్తీ హీరోగా వస్తున్న ఓ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని జోరుగా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి కార్తీతో సినిమా అనేది ఓకే అయితే అన్నదమ్ములకు జంటగా కృతి శెట్టి చేసినట్లు అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading