Home » నెగెటివ్ పాత్రలో కృతి శెట్టి కొత్త ప్రయత్నం..!

నెగెటివ్ పాత్రలో కృతి శెట్టి కొత్త ప్రయత్నం..!

by Azhar
Ad

ఉప్పెన సినిమాతో ఒక్కేసారి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ అమ్మడుకు తన మొదటి సినిమాతో ఆఫర్స్ అనేవి భారీగా వచ్చిన చేరిన విషయం తెలిసిందే. అయితే అందులో మొదట్లో సినిమాలు అనేవి హిట్ అయిన కూడా ఈ మధ్య కాలంలో కృతి శెట్టి నటిస్తున్న అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్న వస్తున్నాయి. తాజాగా కృతి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ది వారియర్ కూడా అంతే.

Advertisement

అయితే ఈ అన్ని సినిమాలో మంచి గ్లామర్ రోల్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను మెప్పించిన కృతి శెట్టి ఇప్పుడు కొత్తగా నెగెటివ్ పాత్రలో కనిపించబోతుంది అని తెలుస్తుంది. అయితే కృతి శెట్టి ఇప్పుడు నటిస్తున్న సినిమాలు కాకుండా తాజాగా నాగ చైతన్యతో కలిసి రెండో సినిమా చేయడనికి ఒప్పుకుంది. వీరి కాంబినేషన్ లో ఈ మధ్యే బంగార్రాజు సినిమాతో వచ్చేసాడు.

Advertisement

ఇక ఇప్పుడు వీరు ఇద్దరు కలిసి వెంకట్ ప్రభు డైరక్షన్ లో కొత్త సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి డబుల్ యాక్షన్ గా నటించబోతుంది అని తెలుస్తుంది. అంటే ఆ రెండు పాత్రలో ఒక్క పాత్ర మంచిగా ఉంటె.. మరొకటి మొత్తం నెగెటివ్ గా ఉండనుంది అని తెలుస్తుంది. మరి ఈ మధ్యే నటనలో విమర్శలకు గురైన కృతి శెట్టి ఇప్పుడు కొత్తగా ఈ నెగెటివ్ పాత్రలో ఎలా నటిస్తుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

ఈ సెంచరీ వారికే అంకితం..!

Visitors Are Also Reading