సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఆయన సినిమా జీవితం… మరియు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. అందులో సుధీర్ బాబు ప్రియదర్శినిల వివాహం కూడా ఒకటి. కృష్ణ ఇందిరా దేవి లకు రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారన్న సంగతి తెలిసిందే. కాగా కృష్ణ తన కూతుర్లకు పెద్దింటి అబ్బాయిలకు ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారట.
Advertisement
ఈ క్రమంలో పెద్ద కూతురును కృష్ణ సంపన్నుల కుటుంబానికి కోడలిగా పంపించారట. అదే విధంగా తన రెండో కూతురు మంజులను సైతం కోటీశ్వరుల ఫ్యామిలీకి కొడలిగా పంపించాలని కృష్ణ భావించే వారట. కానీ మంజుల ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో కృష్ణ హర్ట్ అయ్యారట. కృష్ణ మంజుల ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేందుకు నో చెప్పారట.
Advertisement
అయినప్పటికీ మంజుల వినకపోవడంతో ఇందిరాదేవి కృష్ణను ఒప్పించి వారి వివాహం జరిపించారట. ఇక ఆ తర్వాత కృష్ణ తన మూడవ కూతురు ప్రియదర్శినిని సైతం కోటీశ్వరుల ఫ్యామిలీకి కోడలిగా పంపించాలని కలలు కన్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన సంబంధాలు చూడటం మొదలు పెట్టారట. కానీ అప్పటికే చిన్న కూతురు ప్రియదర్శిని సుధీర్ బాబును ప్రేమించినట్టు చెప్పిందట.
ఈ వివాహం కూడా మొదట కృష్ణకు నచ్చలేదట…. కానీ చివరికి ఒప్పుకోక తప్పలేదు. దాంతో సుధీర్ బాబును ఇల్లరికం రావాలని కృష్ణ కండిషన్ పెట్టారట. సుధీర్ బాబు కూడా ఆ కండిషన్ కు ఓకే చెప్పి ఇల్లరికం వచ్చారు. దాంతో కృష్ణ సుధీర్ బాబు ప్రియదర్శిని ల వివాహాన్ని జరిపించినట్టు తెలుస్తోంది. ఇక చివరి రోజుల్లో కృష్ణకు ఇందిరాదేవికి సుధీర్ బాబు సైతం సేవలు చేసిన సంగతి తెలిసిందే.