టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆనాటి తరం హీరోలలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు మధ్య ఎప్పుడు కూడా పోటీ ఉండేది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్,కృష్ణ ఏఎన్నార్,ఎన్టీఆర్, శోభన్ బాబు,కృష్ణంరాజు సినిమాలు ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఎవరికి వారే పై చేయి సాధిస్తూ వచ్చేవారు. ఈ విధంగా ఈ హీరోలందరూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీ ని కూడా తారాస్థాయిలో నిలిపారు. ఈ తరుణంలోనే అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి టిడిపి పార్టీ తరఫున సీఎం అయ్యారు..
Advertisement
also read;మళ్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?
అయితే ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద అభిమాని. ముఖ్యంగా తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళభైరవి మూవీ కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసిందట. ఈయన నటుడిగా ప్రయత్నాలు చేయడానికి చెన్నై వెళ్లినప్పుడు కృష్ణ ముందుగా ఎన్టీఆర్ నే కలిశారట. అయితే కృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఈనాడు ఒకటి. ఈ సినిమాల్లో మొదట ముత్యాలముగ్గు శ్రీధర్ ని హీరోగా భావించారు. అంతేకాకుండా పి. సాంబశివరావును డైరెక్టర్గా ఎంపిక చేసి పరుచూరి బ్రదర్స్ కి అప్పగించారు. కానీ ఈ చిత్రంలో కృష్ణ హీరోగా నటిస్తే బాగుండని పరుచూరి బ్రదర్స్ డైరెక్టర్ కు చెప్పారట. దీంతో కృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే విధంగా కథలో మార్పులు చేర్పులు చేసుకొని మాటలు కూడా రాసుకున్నారట పరుచూరి బ్రదర్స్.
Advertisement
ఆ విధంగా కృష్ణ 200 వ సినిమాగా ఈనాడు తెర మీదికి వచ్చింది.1982 డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట సినిమాను వేరే లెవెల్ లో నిలిపిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ పాటను చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు మద్దతుగా కృష్ణ ఈ పాటలో నటించారని భావించారు. ఈ విధంగా ఈనాడు సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకుని సీఎం అయ్యారు. దీంతో ఎన్టీఆర్ కు అభినందనలు తెలియజేస్తూ కృష్ణ పేపర్లో ఒక యాడ్ వేశారు.ఆ యాడ్ అప్పట్లో సంచలమైందని చెప్పవచ్చు.
also read;నిశ్చితార్థం జరిగిన తరువాత బ్రేకప్ అయిన నటులు వీరే..!