Home » అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని మూవీస్ చేశారంటే..!!

అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని మూవీస్ చేశారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరు ఇండస్ట్రీలో చాలా సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోల్లో ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది ఎన్టీఆర్. నిజానికి కృష్ణ తీసిన 200 వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది అని చెప్పవచ్చు.

Advertisement

ఇక ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు వందరోజుల సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం ప్రధాని అవ్వడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ ఆహ్వానం పలకడంతో ఆయన కాంగ్రెస్లో చేరారు.

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో కృష్ణ డైరెక్షన్లో వచ్చిన తొలి మూవీ సింహాసనంలో రాజగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడారు. నా దగ్గరేముంది బూడిద అనే డైలాగ్. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ ను పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ దాసరి నారాయణతో రాయించి సినిమా హాల్స్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు టిడిపి కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకు ఇంకా పబ్లిసిటీ ప్లాన్ చేశారు,

Advertisement

ఇది ముందే గమనించిన ఎన్టీఆర్ ఎవరు tకూడా ఆందోళన చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాత ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మండలాధీశుడు సినిమాను కృష్ణ తీశారు. ఎన్టీఆర్ ను పోలిన పాత్రను కోట వేయగా సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం సంచలనం. ఈ చిత్రం మొదట్లో కృష్ణ కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో నటించినందుకు కోటాకు రెండేళ్ల పాటు సినిమాల్లో ఛాన్సులు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ తీశారు కృష్ణ. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో గండిపేట రహస్యం అనే మరో సెటైరికల్ చిత్రం కూడా వచ్చింది. ఈ విధంగా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అప్పట్లో కృష్ణ తీసి సంచలనంగా మారారని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading