Home » అన్న‌పూర్ణ స్టూడియో నిర్మాణానికి హీరో కృష్ణే కార‌ణ‌మా?

అన్న‌పూర్ణ స్టూడియో నిర్మాణానికి హీరో కృష్ణే కార‌ణ‌మా?

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అనగానే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ గుర్తొస్తుంది. ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అస‌లు ఎందుకు నిర్మించారు అన్నదాని గురించి తెలుసుకుందాం.

అప్పట్లో దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమ అనగానే మద్రాస్ పేరు వినిపించేది.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషా చిత్రాలన్ని మద్రాసు కేంద్రంగా సినిమాలను నిర్మించేవారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా షూటింగ్ అంటే మ‌ద్రాస్ కి ప‌రిగెత్తేవారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానమంతా మద్రాస్ సినీ పరిశ్రమలోనే ఉండడం గమనార్హం. సినీ రంగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం మద్రాసులోనే ఉండడంతో ఇతర భాషా నటులు కూడా మద్రాసుకి వచ్చి సినిమాలు తీస్తూ ఉండేవారు.. ఇక చాలా మంది హీరోలు కూడా మద్రాస్ లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Advertisement

 

డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 1975 సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించాడు. అప్ప‌ట్లో ఒక‌రు సినిమా తీస్తే స్టేట్ మొత్తం ఒక్క‌రే కొనేవారు. ఆ సినిమా ఎవ‌రికిన‌చ్చితే వారే కొని విడుద‌ల చేసేవారు. దాని గురించి ముందుగానే అగ్రిమెంట్ అయిపోయేది. న‌వ‌యుగ ఫిలిమ్స్ అని అప్ప‌ట్లో ఒక పెద్ద బ్యాన‌ర్ ఉండేది. న‌వ‌యుగ ఫిలిమ్స్ అంటే చౌద‌రీస్ చాలా పెద్ద ప్రొడ్యూస‌ర్స్‌. విజ‌య నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌దాస్ చిత్రం కృష్ణ హీరోగా న‌టించారు. ఆ చిత్రం న‌వ‌యుగ ఫిలిమ్స్ వాళ్ళు కొనుక్కుని విడుద‌ల‌కి రెడీ చేసుకున్నారు. నాగేశ్వ‌ర‌రావు దేవ‌దాస్ చిత్రం కూడా అదే రోజు రీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. అప్ప‌టికే ఆ చిత్రం మ‌ళ్ళీ మూడుసార్లు వ‌చ్చి వంద రోజులు ఆడి వెళ్ళిపోయింది. దాదాపు సంవ‌త్స‌రం ఆడింది. ఆ త‌ర్వాత ఎప్పుడు విడుద‌ల‌యినా కూడా వంద‌రోజులు త‌ప్పించి అంత‌కు త‌క్కువ ఎప్పుడూ ఆడ‌లేదు. ఇక నాలుగో రిలీజ్ అనేది క‌రెక్ట్‌గా కృష్ణ‌గారి దేవ‌దాస్ చిత్రం రిలీజ్ రోజున కావాల‌ని పెట్టారు. న‌వ‌యుగ వాళ్ళు నాగేవ్వ‌రావు ద‌గ్గ‌ర‌కు వెళ్ళి కృష్ణ‌గారి దేవ‌దాస్ విడుద‌ల‌వుతుంది ఈ స‌మ‌యంలో మీరు పెడితే క‌ష్ట‌మ‌ని చెప్పారు. కొంచెం ఒక వారం రోజులు అటు..ఇటుగా పెట్టుకోమ‌న్నారు. దానికి నాగేశ్వ‌రావు మీ సినిమా మీది.. మా సినిమా మాది అని స‌మాధానం ఇచ్చారు. దాంతో న‌వ‌యుగ వారికి చాలా కోపం వ‌చ్చింది. అప్ప‌టికి సార‌ధి స్టూడియో న‌వ‌యుగ సంస్థ వారి చేతిలో ఉంది. న‌వ‌యుగ ఫిలిమ్స్‌, సార‌ధిస్టూడియోస్ వీరంతా అన్న‌ద‌మ్ములు. దాంతో నాగేవ్వ‌రావు సినిమాలు సార‌ధిస్టూడియోస్‌లో బ్యాన్ చేశారు.

Advertisement

నాగేశ్వ‌ర‌రావు సినిమాలు సార‌ధిస్టూడియోస్ లో జ‌ర‌గ‌డానికి లేదు అన్నారు. నాగేశ్వ‌ర‌రావు అప్ప‌టికే కుటుంబ స‌మేతంగా మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కి నివాస‌ముండ‌డానికి వ‌చ్చేశారు. దాంతో నాగేశ్వ‌ర‌రావు సినిమా షూటింగ్‌ల‌కు క‌ర్ణ‌ట‌క‌లోని కంటిర‌వ స్టూడియో ఉండేది. క‌న్న‌డ కంటిర‌వ రాజ్‌కుమార్ స్టూడియోలో ఆయ‌న షూటింగ్‌లు అన్నీ జ‌రిగేవి. ఇక ప్ర‌తి షూటింగ్‌కి బెంగుళూరు వెళ్ళి షూటింగ్‌లు చేసుకునేవారు. అంత దూరం వెళ్ళ‌డం రావ‌డం చాలా ఇబ్బంది క‌లిగేది. దీంతో స్టూడియోకోసం వాళ్ళ‌ను వీళ్ళ‌ను బ్ర‌తిమిలాడేదేంటి. అస‌లు నేను ఒక స్టూడియో క‌ట్టుకుంటా అంటూ అన్న‌పూర్ణ స్టూడియో క‌ట్ట‌డం జ‌రిగింది. అలా కృష్ణ‌కి సంబంధం లేక‌పోయిన‌ప్ప‌టికి కృష్ణ సినిమా వ‌ల్ల నాగేశ్వ‌ర‌రావు స్టూడియో క‌ట్టాల్సి వచ్చింది.

అనుకున్న‌దే త‌డ‌వు పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లతో నిండి ఉన్న, ఆ స్థలాన్ని చదును చేయడానికి ఏకంగా రెండు సంవత్సరాలపాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 22 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి, అక్కినేని నాగేశ్వర రావు ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ఒకపక్క నిర్మాణ పనులు జరుగుతూనే, మరోపక్క 1976 జనవరి 14 వ నాటి రాష్ట్రపతి ఫ్రకృద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించారు.11000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి అంతస్తు పూర్తి అయ్యింది.

Visitors Are Also Reading