టాలీవుడ్ అభిమానులకు ఎవరికీ సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. తెలుగులో 300 లకు పైగా సినిమాలో హీరోగా నటించిన ఆయన.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ అనే పేరును తెలుగు నుండి అందరికి తెలిసేలా చేసారు. అయితే తెలుగులో అప్పట్లో అందరికంటే కృషకే ఎక్కువ మంది అభిమానులు ఉండేవారు. అయితే వారిని అందరిని మెప్పించడానికి ఎప్పటిక్కప్పుడు కొత్త తరహా సినిమాలు చేసేవారు. అందుకే మన తెలుగులో ప్రయోగాలు చేయాలి అంటే ఆది కృష్ణ తర్వాతే ఎవరైనా అని చాలా మంది అంటుంటారు.
Advertisement
అయితే కృష్ణ అలాగే విజయనిర్మల కలిసి నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో వీరి కంబియేషన్ లో చాలా సినిమాలు అనేవి వచ్చాయి. అయితే ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ అనేది ప్రారంభమైంది. కానీ అప్పటికే కృష్ణకు మహేష్ బాబు తల్లి అయిన ఇందిరాతో పెళ్లి జరిగింది. అయినా కూడా తన భార్యను ఇందిరాను ఒప్పించి విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కృష్ణకు అలాగే మొదటి భార్య ఇందిరాకు కొంత గ్యాప్ వచ్చింది అని.. కృష్ణకు రెండో భార్య అంటేనే చాలా ఇష్టం అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు కృష్ణ కూతురు మంజుల చేసిన ఓ పని వల్ల అది ప్రపంచానికి మరోసారి తెలిసింది.
Advertisement
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు యూట్యూబ్ లో తమ హోమ్ టూర్ అనేది చేస్తున్నారు. అందులో భాగంగా మంజుల కూడా తన తండ్రి కృష్ణ యొక్క హోమ్ టూర్ చేసింది. ఇందులో విజయ నిర్మలకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలిసాయి. విజయ నిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ ఎక్కువగా బయటికి రావడం లేదట. అలాగే ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కృష్ణగారు చాలా జాగ్రతగా చేసేవాడట. అలాగే ఆమె చనిపోయిన తర్వాత కృష్ణ తన ఇంట్లోనే విజయ నిర్మలకు సంబంధించిన ఓ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో ఈ విషయాలు తెలుసుకున్న ఫ్యాన్స్ కృష్ణకు రెండో భార్య అంటేనే ఇష్టం అని మళ్ళీ కామెంట్స్ అనేవి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :