Home » Krishana:మీరే నా హీరో మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను తాత గారూ అంటూ సితార ఎమోషనల్ పోస్ట్..!!

Krishana:మీరే నా హీరో మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను తాత గారూ అంటూ సితార ఎమోషనల్ పోస్ట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేని బుధవారం తమ తాత కృష్ణకు నివాళులర్పించారు. సోషల్ మీడియాలో సితార, గౌతమ్ ఇద్దరూ తమ తాత కృష్ణ భౌతికకాయం వద్దకు వెళ్లి ఆయన పాదాల వద్ద పూలు ఉంచిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్‌లో, గౌతమ్, సితార ఇద్దరూ పువ్వులు ఎక్కడ వేయాలో వారి తల్లి, నమ్రతా శిరోద్కర్ చెప్పడం చూడవచ్చు. తెలుగు సినిమా తొలి సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన కృష్ణను సితార కూడా తాత తన హీరో అని బాధతో రాసిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది..

తన పోస్ట్‌లో, సితార తన తాతతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాత ఫోటోలో సితార, కృష్ణ వైపు వంగి నవ్వింది. సితార భుజంపై చేయి వేసిన కృష్ణ నవ్వుతూ కనిపిస్తున్నాడు. సితార తెల్లటి టీ షర్ట్ మరియు నీలిరంగు ప్యాంట్‌ను ధరించింది. కృష్ణ పసుపు రంగు చొక్కా మరియు ముదురు సన్ గ్లాసెస్ ధరించాడు. ఈ పోస్ట్‌కి సితార ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చింది, “వారం రోజుల మధ్యాహ్న భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు..మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. నన్ను ఎప్పుడూ నవ్వించారు. ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం మాత్రమే. మీరు నా హీరో…ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను.

నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ..అంటూ తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఈ పోస్ట్‌పై ఒక వ్యక్తి స్పందిస్తూ, “తెలుగు ఇండస్ట్రీ లెజెండ్‌ హీరోను మిస్ అవుతున్నాం. నేను కృష్ణకు పెద్ద అభిమానిని సార్ మిస్ యూ సార్” అని అన్నారు. “మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంటారని రాసుకోచ్చాడు. ఈ పోస్టులు చూసిన చాలా మంది అభిమానులు వారి యొక్క బాధను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

also read:కృష్ణ పేరిట ఉన్న 19 రికార్డులు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

Visitors Are Also Reading