Telugu News » 60ఏళ్లు వ‌చ్చినా పెళ్లి దూరంగా కోవై సరళ…. వాళ్ల కోసమే అంతటి త్యాగం…!

60ఏళ్లు వ‌చ్చినా పెళ్లి దూరంగా కోవై సరళ…. వాళ్ల కోసమే అంతటి త్యాగం…!

by AJAY MADDIBOINA

మేల్ క‌మెడియ‌న్ ల పేరు చెప్ప‌మంటే ట‌క్క‌న ప‌దికి పైగా పేర్లు చెప్పేస్తారు. కానీ అదే ఫీమేల్ క‌మెడియ‌న్ ల పేరు చెప్ప‌మంటే వెంట‌నే ఆలోచ‌న‌లో ప‌డి స్ట‌క్ అయిపోతారు. దానికి కార‌ణం ఫీమేల్ క‌మెడియ‌న్స్ చాలా త‌క్కువ మంది ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తుండిపోయే లేడీ క‌మెడియ‌న్ మాత్రం ఒక్క‌రున్నారు ఆవిడే కోవై స‌ర‌ళ‌. 800ల‌కు పైగా సినిమాల్లో న‌టించిన ఈ లేడీ కమెడియ‌న్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Ads

ముఖ్యంగా బ్ర‌హ్మానందం కోవై స‌ర‌ళ పెయిర్ అంటే అప్ప‌ట్లో ఓ క్రేజ్ ఉండేది. చాలా సినిమాల్లో బ్ర‌హ్మానందంతో కోవై స‌ర‌ళ క‌లిసి న‌టించి కామెడీని పండించింది. అంతే కాకుండా త‌న కామెడీకి ఎంతో మంది అభిమానులు ఉండ‌టంతో వ‌రుస సినిమాల‌తో కోవై స‌ర‌ళ ఫుల్ బిజీగా ఉండేది. నువ్వే కావాలి సినిమాలో కోవై స‌ర‌ళ కామెడీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో న‌వ్వించింది. ఈ సినిమాలో కోవై స‌ర‌ళ లుక్ చూస్తేనే న‌వ్వొస్తుంది.

అంతే కాకుండా దేశ‌ముదురు సినిమాలో స‌న్యాసిని వేశంలో న‌టించి కూడా కామెడీ ని పండించింది. ఇక కోవై స‌ర‌ళ చివ‌ర‌గా లారెన్స్ హీరోగా న‌టించి దర్శ‌క‌త్వం వ‌హించిన కాంచ‌న సినిమాతో వ‌చ్చి క‌డుపుబ్బా న‌వ్వించింది. కోవై స‌ర‌ళ వాయిస్ చూసి మొద‌ట్లో ఆమెకు ఆఫ‌ర్లు ఇచ్చేవారు కాద‌ట‌. కానీ ఆ త‌వ‌రాత ఆమె వాయిసే అదృష్టంగా మారింది. ఇక సినిమాల్లో ఎంతో స‌క్సెస్ అయి కోవై స‌ర‌ళ ప్ర‌స్తుతం మాత్రం టాలీవుడ్ కు పూర్తిగా దూర‌మైపోయింది. కాగా రీసెంట్ గా మ‌ళ్లీ కోవై స‌ర‌ళ మీడియా ముందు క‌నిపించింది. దాంతో మీరు తెలుగులో ఎందుకు సినిమాలు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించాడు. తాను తెలుగులో ఎన్నో సినిమాలు చేశాన‌ని మ‌ళ్లీ అవకాశాలు వ‌చ్చినా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని చెప్పింది. ఇదిలా ఉంటే కోవై స‌ర‌ళ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. కోవై స‌ర‌ళ వ‌య‌సు ప్ర‌స్తుతం 59 సంవ‌త్స‌రాలు అయినా ఆమె మాత్రం పెళ్లి చేసుకోలేదు.

అయితే కోవై స‌ర‌ళ పెళ్లి చేసుకోక‌పోవ‌డాకి కార‌ణం ఆమెకు ఉన్న బాధ్య‌త‌లే. మొద‌ట్లో కుటుంబం ఆర్థికంగా వెన‌క‌బ‌డ‌టంతో త‌న న‌లుగురు చెల్లెల్ల బాగోగులు తానే చూసుకుంద‌ట‌. ఈ క్ర‌మంలో వాళ్ల కోసం జీవితాన్ని త్యాగం చేసి తాను పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయింద‌ట‌. వాళ్ల చదువుల కోసం ఆ త‌ర‌వాత వారి పెళ్లిళ్ల కోసం క‌ష్ట‌ప‌డిని కోవై స‌ర‌ళ చివ‌రికి ఒంటరిగా మిగిలిపోయింది. అంతే కాకుండా కోవై స‌ర‌ళ సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటుంది. ఏది ఏమైనా కోవై స‌ర‌ళ త‌న జీవితం గురించి కూడా ఆలోచించి ఓ తోడును వెతుక్కుని ఉంటే బాగుండేదేమో.

ALSo READ :

బొక్కేం కాదు, వినేవాడు వీపీ అయితే అంటూ నాగార్జున పై మ‌ధ‌వీల‌త ఫైర్..!

“అశోక వనం లో అర్జున కళ్యాణం” సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !


You may also like