Home » దారుణం.. కోవై సరళని చూస్తే తట్టుకోలేరు.. కన్నీరు ఆగదు..!!

దారుణం.. కోవై సరళని చూస్తే తట్టుకోలేరు.. కన్నీరు ఆగదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ లేడి కమెడియన్లలో ఎంతో పేరు తెచ్చుకున్న నటి కమెడియన్ కొవై సరళ.. ఇండస్ట్రీలో బ్రహ్మానందం -కోవై సరళ కాంబినేషన్ ఇప్పటికి నవ్వు వస్తుంది. కోవై సరళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది. మంచి గుర్తింపు సంపాదించింది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అడపా దడపా కొన్ని సినిమాలు చేసుకుంటూ కనబడుతోంది. అలాంటి కోవై సరళ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది దానికి కారణం ఏంటో చూద్దాం..

Advertisement

also read:పిల్లల్ని కనాలనుకుంటున్నారా.. సరైన సమయం ఏంటంటే..?

ఈ మధ్యకాలంలో కోవై సరళ ఎక్కువగా రాఘవ లారెన్స్ చిత్రాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా కాంచన సినిమాలో ఆమె క్యారెక్టర్ వేరే లెవెల్.. అలాంటి కోవై సరళ చాలా రోజుల తర్వాత ఎవరు ఊహించని విధంగా కనబడుతోంది . ఆమెకు ఏం జరిగిందంటూ కలవర పడుతున్నారు.. ఇంతకీ ఆమెకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన సెంబి మూవీ రెండో ట్రైలర్ విడుదలైంది . ఇందులో కోవై సరళ లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒక పాత్ర కోసం మరీ ఇంతలా మారిపోవాలా అంటూ షాక్ అవుతున్నారు..

Advertisement

ఈ లుక్కుకు కోవైసరళ కు తప్పకుండా ఉత్తమ నటిగా అవార్డు వస్తుందని ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.. అయితే ఈ ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం బడుగు బలహీన వర్గాలను రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏ విధంగా వాడుకుంటారో అనే పాయింట్ ఆఫ్ లో సినిమా వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఓట్లు వేస్తే డాక్టర్ అవ్వరు చదువుకుంటే డాక్టర్ అవుతారంటూ తన మనవరాలికి సరళ చెప్పే డైలాగ్ చూస్తే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ చిత్రంలో కోవై సరళ లుక్ మాత్రం ప్రత్యేకము అని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading