ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు గురించి తెలయని వారుండరు. ఆయన కెరియర్ మొదలు పెట్టినప్పుడు కొన్ని చిత్రాల వల్ల ఆయన విమర్శలు ఎదుర్కున్నప్పటికీ ఆ తరువాత ప్రతినాయకుడిగా (విలన్‌గా) అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక ఈయన విలన్ పాత్రలో నటించడం అంటే ఒకరకంగా చెప్పాలంటే అది జీవించాడని చెప్పాలి. శ్రీకాంత్, ఊహ నటించిన ఆమె చిత్రంలో ఈయన పాత్ర చాలా భయానకంగా ఉంటుంది. ఆ సమయంలో ఆడవారు ఈయనని చూసి భయపడేవారు కూడా. మంచి కమెడియన్‌గా అలాగే తాత పాత్రలో కూడా ఆయన నటించి మెప్పించారు. వయసు పై బడటంతో ఇండస్ట్రీకి ఆయన దూరమయ్యారు.
ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొ్న్న ఆయన తనగురించి తన కొడుకు గురించి ఓ ఆశసక్తికర విషయాన్ని తెలిపారు. టాలీవుడ్‌లో కోటాశ్రీనివాసరావుకి, జగపతిబాబుకి మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతోనే ఓసారి జగపతిబాబు కోటాశ్రీనివాసరావుని తన కుమారిడిని సినీ ఇండస్ట్రీకి తీసుకురావచ్చుగా అన్నారు. వస్తే హీరో అవ్వాల్సిన అవసరం లేదు కానీ నాలాగా విలన్ అయితే చాలు ఎన్నో అవకాశాలు ఉంటాయి అన్నారు. అదే సమయంలో జగపతిబాబు గాయం 2 చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రంలో కోటాశ్రీనివాసరావు కొడుకు విలన్‌గా నటించారు.
ఇక ఈ చిత్రంలో జగపతి బాబు కోటా కొడుకుని చంపే సీన్ ఉంటుంది. చంపి కోటా దగ్గరకి తీసుకువచ్చి పాడేమీద తీసుకురావాలి. దాని కోసం చిత్ర యూనిట్ వారు పాడెను కూడా సిద్ధం చేశారు. ఎంతైన కొడుకును పాడెమీద చూడ్డానికి తండ్రిగా ఆయన మనసు అంగీకరించలేదు. దాంతో జగపతిబాబు వద్దకు వెళ్ళి నేను అలా నా కొడుకుని పాడె మీద చూడలేనండీ అని చెప్పారు కోటాశ్రీనివాసరావు. మీ బాధ నాకు అర్ధమయింది. అని ఆ సీన్‌లో ఓ డూప్‌ని పెడదామని అన్నారు. అది జరిగిన వారం రోజులకే తన కొడుకుని పాడెపై చూడాల్సి వచ్చిందని బైక్ యాక్సిడెంట్ అయి నిజంగానే పాడె ఎక్కాడని భావోద్వేగానికి గురయ్యారు