Telugu News » Blog » ఆ హీరోయిన్ తో స్టార్ హీరో తనయుడి ప్రేమాయ‌ణం.. ఫొటోలు వైర‌ల్‌..!

ఆ హీరోయిన్ తో స్టార్ హీరో తనయుడి ప్రేమాయ‌ణం.. ఫొటోలు వైర‌ల్‌..!

by Anji
Ads

కోలివుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌కు తెలుగులో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక చియాన్ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టాడు ధృవ్‌విక్ర‌మ్‌. టాలీవుడ్‌లో సెగ‌లు పుట్టించిన అర్జున్‌రెడ్డి రీమెక్ వ‌ర్మ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగులోకి పెట్టాడు ధృవ్‌. త‌న మొద‌టి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసాడు. అగ్రెస్సివ్ డాక్ట‌ర్‌గా, ప్రేమ విఫ‌ల‌మైన ప్రేమికుడిగా ధృవ్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ సినిమా త‌రువాత తండ్రి కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు కూడా వినిపించాయి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌డ‌నే పెడితే.. ప్ర‌స్తుతం ధృవ్ విక్ర‌మ్ ల‌వ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల‌యింది.

Advertisement

 

నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల్లో భాగంగా ఈ జంట క‌లిసి దుబాయ్ వెళ్లారు. అక్క‌డ ఓ హోట‌ల్ రూమ్‌లో బ‌నిత‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో డ‌ర్కెస్ట్ హోల్డ్ ఆన్ వీ ఆర్ గోయింగ్ హోం అనే ఇంగ్లీషు పాట‌ను జ‌త చేశాడు. అంతేకాదు బ‌నిత త‌మ హోట‌ల్ రూమ్ బాల్కానిలో నిల‌బ‌డిన ఫోటోను కూడా షేర్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ విష్ చేశాడు ధృవ్‌.

Advertisement

 

వ‌ర్మ చిత్రంతో కోలీవుడ్‌కు ప‌రిచ‌యం అయిన బ‌నిత సంధుతో ధృవ్ ప్రేమాయణం న‌డుపుతున్న‌డు అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భార‌త సంత‌తికి చెందిన బ్రిట‌న్ బ్యూటిగా వ‌ర్మ సినిమా కోసం చెన్నై వ‌చ్చిన ఈ చిన్న‌ది ఈ షూటింగ్‌లోనే ధృవ్ తో ప్రేమ‌లో పేడిపోయింద‌ట‌. ధృవ్ కూడా అమ్మ‌డి ప్రేమ‌లో పీక‌ల్లోతు మునిగిపోయాడ‌ని, ఇప్ప‌టికీ వీరిద్ద‌రూ అప్పుడ‌ప్పుడు క‌లుస్తూ.. కెమెరా కంట చిక్కారు అని తెలుస్తోంది. ఇక అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. మరొక రెండు ఏళ్ల‌లో ధృవ్ ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

Advertisement

అయితే వార్త‌ల‌పై విక్ర‌మ్ అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఒక సినిమా మాత్ర‌మే చేసి, కెరీర్‌ను చూసుకోకుండా ప్రేమ పెళ్లి ఇప్పుడు అవ‌స‌ర‌మా..? విక్ర‌మ్ అయినా బుద్ది చెప్పాలి క‌దా..? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం ఐదారు సినిమాలు తీసి ఓ స్టార్‌గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుని ఇవ‌న్నీ చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు అభిమానులు. ఈ వార్త‌లో మాత్రం నిజం ఎంత ఉందో తెలియాలంటే విక్ర‌మ్‌, ధృవ్ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఓపెన్ అయితేనే అస‌లు నిజం తెలుస్తుంద‌ని త‌మిళ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.