Home » IPL 2022 : ముంబై పై కోల్‌క‌తా ఘ‌న విజ‌యం

IPL 2022 : ముంబై పై కోల్‌క‌తా ఘ‌న విజ‌యం

by Anji
Published: Last Updated on

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు వ‌రుస‌గా మూడ‌వ ఓట‌మి పాలైంది. పూణే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. క‌మిన్స్ విజ‌యంలో కీల పాత్ర పోషించారు. ముఖ్యంగా కేవ‌లం 15 బంతుల్లోనే 56 ప‌రుగులు చేశాడు. అదేవిధంగా వెంక‌టేష్ అయ్య‌ర్ హాప్ సెంచ‌రీ చేయ‌డంతో కోల్‌క‌తా ప‌ని సుల‌భ‌మైంది.

తొలుత 15 ఓవ‌ర్ల వ‌ర‌కు ముంబయి బ్యాట్స్‌మెన్లు నెమ్మ‌దిగా ఆడారు. ఆ త‌రువాత కాస్త వేగం పెంచారు. చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో 76 ప‌రుగులు చేశారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో ముంబ‌యి నాలుగు వికెట్ల కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. ముంబ‌యి బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (52 36 బంతుల్లో) రాణించాడు. తిల‌క్ వ‌ర్మ (38 : 27 బంతుల్లో ) డెవాల్డ్ బ్రెవీస్ (29 : 19 బంతుల్లో) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(3) ప‌రుగులు చేసి విఫ‌లమ‌య్యాడు. చివ‌రిలో వ‌చ్చిన కీర‌న్ పోలార్డ్ (22: 5 బంతుల్లో) మూడు సిక్స్‌లో కొట్టాడు. ఫ్యాట్ క‌మ్మిన్స్ 2, ఉమేష్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరొక‌ వికెట్ తీశారు.

తొలుత ఓపెన‌ర్లు అజింక్య ర‌హానె, వెంక‌టేష్ అయ్య‌ర్లు బ‌రిలోకి దిగ‌గా 16 ప‌రుగుల వ‌ద్ద‌నే ర‌హానే టైమల్ మిల్స్ కు బౌలింగ్‌లో డానియ‌ల్ సామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత వెంట వెంట‌నే కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (10), శాస్ బిల్లింగ్స్ (17), నితిస్ రాణా (08), ర‌స్సెల్ (11) వికెట్లు ప‌డ‌డంతో ముంబై జ‌ట్టు గెలుపుపై ఆశ‌లు పెట్టుకుంది. ర‌స్సెల్ ఔట్ కాగానే క్రీజులోకి వ‌చ్చిన ఫ్యాట్ క‌మ్మిన్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 15 బంతుల్లోనే ( 6 సిక్స్‌లు, 4ఫోర్లు) 56 ప‌రుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. 4 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించారు.

Visitors Are Also Reading