కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. కొత్త కెప్టెన్,కొత్త ముఖాలతో రంగంలోకి దిగిన కేకేఆర్ ముందు పెద్ద జట్లు కూడా నిలవడం లేదు. తొలి మ్యాచ్‌లోనే ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. తాజాగా ముంబై ఇండియన్స్ ను కూడా ఓడించింది. కోల్‌కతా విజయంలో మరొకసారి ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ముఖ్యపాత్ర పోషించాడు. ఓపెనింగ్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.
Advertisement
ఏప్రిల్ 06న పూణేలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడవ విజయం. ఈ మ్యాచ్‌లో ఉమేష్ 1 వికెట్ తీసాడు. ఉమేష్ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు సాధించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ రోహిత్ శర్మకు ఔట్ చేశాడు. అదేవిధంగా వరుసగా నాలుగవ మ్యాచ్‌లో పవర్ ప్లేలో వికెట్ తీశాడు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
Advertisement
ఈ మ్యాచ్‌లో ఉమేష్‌తో పాటు ముంబైకి చెందిన లెప్టార్మ్ ఫాస్ట్ బౌలర్ టిమల్ మిల్స్ 2 వికెట్లు తీయగా.. ఇప్పుడు అతను 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు సాధించి ఆరవ స్థానంలో ఉన్నాడు. వీరితో పాటు రాహుల్ చాహర్, పసిందు హసరంగా 6 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఉమేష్ కేవలం వికెట్లే కాదు.. ఎకానమీలో కూడా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ కేకేఆర్ పేసర్ టోర్నీలో అత్యధికంగా 54 డాట్ బాల్స్ బౌలింగ్ వేశాడు. కేవలం ఓవర్ 5.25 చొప్పున పరుగులు ఇస్తున్నాడు. మరోవైపు కేకేఆర్ లెజెండరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 4.75 చొప్పున పరుగులు ఇస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
Also Read : IPL 2022 : ముంబై పై కోల్‌కతా ఘన విజయం