Home » పుష్ప స్టైల్‌లో కోహ్లీ డ్యాన్స్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..?

పుష్ప స్టైల్‌లో కోహ్లీ డ్యాన్స్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..?

by Anji
Ad

అల్లుఅర్జున్ పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి హుస్టెప్ క్రికెట‌ర్ల‌కు బాగా న‌చ్చుతున్న‌ది ఇప్పుడు. ఈ స్టెప్ న‌కు త‌మ‌దైన శైలిలో నెట్టింట్లో ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ లిస్ట్‌లో ఎంతో మంది క్రికెట‌ర్లు త‌మ టాలెంట్ చూపించి ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ఈస్టెప్ జాబితాలో భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీ‌వ‌ల్లి పాట‌లోని హుక్ స్లెస్‌ను త‌న‌దైన శైలిలో కాపీ చేశాడు. విరాట్ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ డ్యాన్స్ చూసిన నెటిజ‌న్లు కూడా ఇర‌త‌దీశావంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read :  సీఎంతో భేటీ త‌ర‌వాత మీడియాతో స్టార్స్ ఏమ‌న్నారంటే..!

Advertisement

మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 237 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. 238 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ ఒడియ‌న్ స్మిత్ 2 సిక్స‌ర్లు బాది భార‌త శిబిరంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం సృష్టించాడు.45వ ఓవ‌ర్‌లో విరాట్ కోహ్లీ ఓడియ‌న్ స్మిత్ క్యాచ్ ప‌ట్టి భార‌త్ శిబిరంలో ఆశ‌లు రేకెత్తించాడు.ఈ ఆనందంలో కోహ్లీ త‌న‌దైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి హుక్ స్టెప్ త‌న‌దైన శైలిలో చేసి నెట్టింట్లో సంద‌డి చేస్తున్నాడు. కోహ్లీ డ్యాన్స్ చూసి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా న‌వ్వుకున్నాడు.

Advertisement

బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ లో వికెట్ తీసిన డ్వేన్ బ్రేవో అల్లుఅర్జున్ సినిమా పుష్ప లోని శ్రీ‌వ‌ల్లి హుక్ స్టెప్‌ని త‌న‌దైన శైలిలో చేసి ఆక‌ట్టుకున్నాడు. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, భార‌త మాజీ క్రికెట‌ర్ సుర‌ష్ రైనా, బంగ్లాదేశ్ స్పిన్న‌ర్ న‌జ్ముల్ ఇస్లాం కూడా ఇదే పాట‌ను అనుక‌రించారు. వార్న‌ర్‌, సురేష్‌, రైనా త‌మ వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో నెట్టింట్లో ర‌చ్చ చేశారు. మ‌రొక‌వైపు కొమిల్లా విక్టోరియ‌న్స్ పై షోహిదుల్ ఇస్లాం వికెట్ తీసిన త‌రువాత అల్లుఅర్జున్ స్టైల్‌ను ఆక‌ట్టుకున్నాడు.

Also Read :  జైలు జీవితం గ‌డిపిన సుమ‌న్‌కు పిలిచి పిల్ల‌నిచ్చిన దిగ్గ‌జం ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading