Home » ఊ అంటావా మావా పాట‌కు కోహ్లీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!

ఊ అంటావా మావా పాట‌కు కోహ్లీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!

by Anji

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అత‌ను సోష‌ల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టులు చేయ‌డం అవి వైర‌ల్ అవ్వ‌డం చూస్తూనే ఉన్నాం. గ‌తంలో కోహ్లీ పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ మాదిరిగా త‌గ్గేదేలే.. అనే స్టెప్ ఏ విధంగా వైర‌ల్ అయిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌స‌మే లేదు. క్రీడా మైదానంలో ఎంత దూకుడుగా క‌నిపిస్తాడో గ్రౌండ్ వెలుప‌ల కూడా అంతే స‌ర‌దాగా ఉంటాడు ఈ మాజీ కెప్టెన్ కోహ్లీ. ప్ర‌స్తుతం ఐపీలో 2022 సీజ‌న్‌లో బెంగ‌ళూరు త‌రుపున ఆడుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉష్ట్ర అంటావా మామ అనే పాట‌కు డ్యాన్స్ చేసాడు కోహ్లీ. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

 

ఆసీస్ మాజీ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ భార‌త సంత‌తికి చెందిన వినీ రామ‌న్‌ను ఇటీవ‌ల పెళ్లాడిన విష‌యం విధిత‌మే. అయితే ఐపీఎల్ బెంగళూరుకు ఆడుగున్న మాక్స్‌వెల్ త‌న‌కు పెళ్లైన సంద‌ర్బంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు స‌భ్యుల‌కు చిన్న పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీ దంప‌తుల‌తో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు, వారి కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. దాదాపుగా అంద‌రూ సాంప్ర‌దాయ దుస్తుల్లోనే పార్టీకి హాజ‌ర‌వ్వ‌డం విశేషం.

ఇక ఈ పార్టీలో విరాట్ కోహ్లీ ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మామ అనే పాట‌కు డ్యాన్స్ చేసాడు. కోహ్లీతో పాటు షాబాజ్ అహ్మ‌ద్‌, అనుజ్ రావ‌త్‌, ఫిన్ అలెన్ వంటి ఆర్‌సీబీ ఆట‌గాళ్లు కూడా ఈ పాట‌కు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : 

Gruhalakshmi ఏప్రిల్ 28 (ఈరోజు) ఎపిసోడ్ : ప్ర‌వ‌ల్లిక రాక‌తో మారిపోయిన తుల‌సి.. చీర తీసి డ్రెస్‌..!

వర్షం తో వచ్చిన లాభాలు వాన తో పోగొట్టుకున్న ఎమ్ఎస్.రాజు…. ఆ నిర్ణయమే కొంపముంచింది…!

Visitors Are Also Reading