సాధారణంగా కొన్ని రకాల మొక్కలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో మొక్కలను చాలా ఇష్టంగా పెంచుతారు. కొన్ని రకాల మొక్కల వలన ఇంట్లో ధనాప్రాప్తి కలుగుతుంది. అలాంటి వాటిలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వలన ధనానికి ఏ లోటు ఉండదు. అందుకే ఈ మొక్కను ఇంటి ముందు, బాల్కనీలో, ఆఫీసులలో కచ్చితంగా పెంచుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన సానుకూల శక్తి కలుగుతుంది.
Advertisement
దీనిద్వారా ఇంట్లో సంపద పెరిగి అభివృద్ధి సాధిస్తారని, ధనవంతులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మనీ ప్లాంట్ ఆకులను నేలపై పడకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ వల్ల ఆర్థిక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఎందుకంటే మనీ ప్లాంట్ శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచడం వలన శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.
Advertisement
శుక్రవారం రోజున మనీ ప్లాంట్ కు ఎర్రదారం కట్టడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే మనీప్లాంట్ కి ఎర్రదారం కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. శుక్రవారం రోజున ఉదయం తలస్నానం చేసి, ఇంట్లో పూజ చేసి, ధూప దీపాలు వెలిగించాలి. మనీప్లాంట్ కి కట్టబోయే దారాన్ని అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజించాలి. పూజ ముగిసిన అనంతరం అమ్మవారికి హారతి ఇచ్చి ఈ దారానికి కుంకుమ పూసి ఆ తర్వాత మనీ ప్లాంట్ కి ఈ దారాన్ని కట్టాలి. ఇలా చేయడం వలన అతి కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇవి కూడా చదవండి
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?
మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్.. మండిపడుతున్న అభిమానులు
Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?