ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాలనేది ప్రతి ఒక్క యువ క్రికెటర్ కళ. ఇందులో ఒక్కసారి ఆడితే చాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్నది యంగ్ క్రికెటర్ల ఆలోచన. అందులో భాగంగానే సదరు ప్లేయర్లకు తమ డ్రీమ్ టీమ్ లు కొన్ని ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతుంటారు ఆటగాళ్లు. తాజాగా ఐపీఎల్లో ఆ టీంకు ఆడాలనేది తన చిన్ననాటి కళ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కె ఎల్ రాహుల్. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాలన్నది తన కళని అన్నాడు.
Advertisement
ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలైనప్పుడు తన ఆలోచన ఇలానే ఉండేదని…. అందుకు తగ్గట్టుగా ఆర్సిబి తనకు అవకాశాలు ఇచ్చిందని రాహుల్ గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఐపీఎల్ 2013 సీజన్ లో ఈ క్యాష్ రిచ్ లీగ్ లోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ ఆర్సిబి తరఫున తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు మరసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఆర్సిబి తరఫున మొత్తం 19 మ్యాచుల్లో 417 పరుగులు చేశాడు. అయితే భుజానికి గాయం కావడం వల్ల కేఎల్ రాహుల్ 2017 సీజన్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆర్సిబి రాహుల్ ను జట్టు నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత పంజాబ్ టీంకు మారిన రాహుల్ కొన్ని ఏళ్ల పాటు కెప్టెన్ గా కొనసాగాడు.
2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జేయింట్స్ కు సారధ్య బాధ్యతలు చేపట్టారు. రెండుసార్లు ప్లే ఆఫ్స్ కు చేర్చిన కప్పు మాత్రం సాధించలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా సేవలు అందిస్తూ జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తాజాగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లీ తర్వాత సఫారీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత కెప్టెన్ గా చరిత్రకి ఎక్కాడు. ఇక రాహుల్ చేసిన వాక్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల హార్దిక్ పాండ్యా తిరిగి సొంతగూటికి వచ్చేసిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ కూడా అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.