Home » జ‌బ‌ర్దస్త్ ఆర్పీ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..? ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లుసుకున్నారంటే..?

జ‌బ‌ర్దస్త్ ఆర్పీ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..? ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లుసుకున్నారంటే..?

by AJAY
Ad

జ‌బర్ద‌స్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిర్రాక్ ఆర్పీ కూడా ఒక‌రు. మొద‌ట కంటెస్టెంట్ గా మెప్పించిన ఆర్పీ ఆ త‌ర‌వాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అద్భుత‌మైన స్కిట్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. అయితే ఆ త‌ర‌వాత నాగ‌బాబు వేరే షోకు వెళ్ల‌గా ఆయ‌న వెంట మ‌రికొంత‌మంది కూడా వెళ్లిపోయారు.ఆ లిస్ట్ లో ఆర్పీ కూడా ఒక‌డు.

Advertisement

ఇక ఆర్పీ ఆ త‌ర‌వాత మాటీవీ లో ఓ షో లో క‌మెడియ‌న్ గా చేయ‌డం తో పాటూ సినిమాల‌లోనూ న‌టించాడు. అయితే కొంత‌కాలంగా అన్నింటికి దూరంగా ఉంటూ వ్యాపారం పైనే దృష్టిపెట్టాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరుతో హైద‌రాబాద్ లో హోట‌ల్ ను ప్రారంభించాడు. అంతే కాకుండా బ్రాంచి ల‌ను సైతం ఏర్పాడు చేస్తూ ఫుల్ గా సంపాదిస్తున్న‌ట్టు చెబుతున్నాడు.

Advertisement

ఇక తాజాగా అమీర్ పేట్ లో కూడా ఆర్పీ ఓ బ్రాంచ్ ను ప్రారంభించాడు. కాగా ఆ బ్రాంచి ఓపెనింగ్ కు శ్రీకాంత్ గెస్ట్ గా వ‌చ్చాడు. అంతే కాకుండా ఆర్పీ వెంట ఆయ‌న ప్రియురాలు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా ఉంది. దాంతో మీడియా ఆర్పీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్ర‌శ్నించ‌గా ఆయ‌న త‌న ల‌వ్ స్టోరీని సైతం వెల్ల‌డించారు. ఈ యేడాది న‌వంబ‌ర్ లో పెళ్లి చేసుకుంటామ‌ని అన్నారు. ఇప్ప‌టికే ఎంగేజ్మెంట్ జ‌రిగింద‌ని చెప్పారు.

తాను అబ‌ద్దాలు చెప్ప‌నని…అమ్మాయి వెంట పిచ్చి కుక్కలా తిరిగాన‌ని అన్నారు. అంతే కాకుండా వాళ్ల పేరెంట్స్ త‌న మంచి త‌నం చూసి ఒప్పుకున్నార‌ని చెప్పారు. ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంట‌ర్ లో అమ్మాయి కోచింగ్ తీసుకుంటూ ఉండ‌గా మొద‌టిసారి చూసి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని బంధువుల ద్వారా అమ్మాయి పేరెంట్స్ తో మాట్లాడాన‌ని అన్నారు.

ALSO READ :‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Visitors Are Also Reading