Home » నన్ను టార్గెట్ చేసి ఇండ‌స్ట్రీ నుండి పంపాల‌నుకుంటున్నారు..యంగ్ హీరో ఎమోష‌న‌ల్..!

నన్ను టార్గెట్ చేసి ఇండ‌స్ట్రీ నుండి పంపాల‌నుకుంటున్నారు..యంగ్ హీరో ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం వ‌రుస సినిమాలు చేస్తూ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బిజీగా ఉన్నాడు. బ‌డా బ్యాన‌ర్స్ నుండి కిర‌ణ్ కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. రాజా వారు రాణి వారు సినిమా కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ్వ‌గా ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా త‌ర‌వాత చాలా సినిమాల్లో న‌టించాడు. ఇక తాజాగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ సినిమాలో న‌టించాడు.

KIRAN ABBAVARAM

KIRAN ABBAVARAM

ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశాడు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం గ‌తంలో న‌టించిన సినిమా నేను మీకు కావాల్సినవాడిని లో త‌న టైటిల్ కు పైన ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్ వేసుకున్నాడ‌ని నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

అయితే ఆ ట్రోల్స్ గురించి యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా హీరో ఎమోష‌న‌ల్ అయ్యాడు. తాను ఇంకా స్టార్ హీరో అవ్వ‌లేద‌ని ఇప్పుడిప్పుడిప్పుడే కాస్త గుర్తింపు వ‌స్తుంద‌ని అన్నాడు. కానీ నెగిటివిటిని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇదంతా కావాల‌నే చేస్తున్నార‌ని త‌న‌ను ఇండ‌స్ట్రీ నుండి పంపించ‌డానికే ఇలా చేస్తున్నార‌ని అన్నాడు.

తాను స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇంకా ట్రోల్ చేస్తున్నార‌ని వ్యాక్యానించాడు. తన సినిమాలో ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్ వేసుకోక‌పోయినా ఎడిట్ చేసి మీమ్స్ వేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాన్ని చాలా మంది న‌మ్మి ఏంటి ఇలా చేస్తున్నావ్ అంటూ ప్ర‌శ్నిస్తున్నార‌ని అన్నాడు. ట్యాగ్ తానే పెట్ట‌కున్నాన‌ని ట్రోల్ చేస్తున్నార‌ని దానికోసం ఇంత దారుణంగా చేయాలా అంటూ ప్ర‌శ్నించాడు.

Visitors Are Also Reading