Telugu News » Blog » మెగాస్టార్ కామెంట్స్ కి హర్ట్ అయిన కిరణ్ అబ్బవరం

మెగాస్టార్ కామెంట్స్ కి హర్ట్ అయిన కిరణ్ అబ్బవరం

by Bunty
Published: Last Updated on
Ads

 

కిరణ్ అబ్బవరం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రాణిస్తున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. రాజావారు రాణిగారుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా అతను ఎస్ ఆర్ కళ్యాణమండపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెబాస్టియన్, పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. ఇక తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కిరణ్.

Advertisement

READ ALSO: రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !

Advertisement

చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం మీదకు వచ్చింది. నేను, రవితేజ మాత్రమే వరుసగా సినిమాలు చేస్తున్నాం అని చిరంజీవి ఆ సభలో అన్నారు. ఆ వీడియోకు కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు ఫోటోలు పెట్టి ఓ వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. దానికి రీట్వీట్ చేసిన కిరణ్ తన ఇబ్బందిని వెలుబుచ్చాడు. గ్యాప్ లేకుండా ఇద్దరు సినిమాలు తీసి జనాల మీదికి వదిలేస్తున్నట్లుగా ఈ పోస్టు, దాని కింద కామెంట్స్ ఉండడంతో కిరణ్ హర్ట్ అయినట్లు ఉన్నాడు.

దీంతో “నా మూడేళ్ల కెరీర్ లో ఐదు సినిమాలే వచ్చాయి. నా పేరు మీద ఇంకెవరైనా సినిమాలు చేసి ఉంటే చెప్పండి, మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను” అని ట్విట్ చేశాడు కిరణ్ అబ్బవరం. అయితే దానికి ఆ నెటిజన్ నుండి రిప్లై లేదు. అయితే నెటిజెన్లు మాత్రం ‘ఇలాంటి వాటికి రిప్లై ఎందుకన్నా’ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కిరణ్ వినరో భాగ్యము విష్ణు కథ పనుల్లో బిజీగా ఉన్నాడు. గీత ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది.

Advertisement

READ ALSO: జియో సంచలన నిర్ణయం… 11 భాషల్లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు…!