Home » Kirak Rp: కర్రీ పాయింట్ పెట్టిన కిరాక్ ఆర్పి.. పేరు భలే ఉందిగా..!!

Kirak Rp: కర్రీ పాయింట్ పెట్టిన కిరాక్ ఆర్పి.. పేరు భలే ఉందిగా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ ఎంతటి ఆదరాభిమానాలు పొందిందో మనందరికీ తెలుసు.. అప్పట్లో జబర్దస్త్ కమెడియన్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కిరాక్ ఆర్పి కామెడీ.. జబర్దస్త్ ప్లాట్ఫామ్ ద్వారా తన కామెడీ టాలెంటును నిరూపించుకొని ఎంతో ఎదిగారు ఆర్ పి.. ఈ విధంగా కామెడీ చేస్తూ కిరాక్ ఆర్పి గా మారారు.. అలాంటి ఆర్పి నటనా రంగంలోనే కాకుండా ఫుడ్ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు.. మరి ఆయన ఏం బిజినెస్ స్టార్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలోనే ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న కమెడియన్ ఆర్ పి పెళ్లికి కూడా రెడీ అవుతున్న తరుణంలో ఆయన అభిమానులకు మరో న్యూ స్ అందించారు..

Advertisement

తాజాగా కర్రీ పాయింట్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు.. ఆయన పది సంవత్సరాల కిందటే దీన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ కుదరకపోవడంతో ఇన్నేళ్లు ఆగాడట.. ఇప్పుడు ఆయన కల నెరవేర్చుకునే సమయం రావడంతో హైదరాబాదులో కర్రీ పాయింట్ ప్రారంభించారు.. కిర్రాక్ ఆర్పి ది నెల్లూరు జిల్లా కాగా అక్కడ చేపల పులుసు చాలా ఫేమస్.. ఆర్పి చేపల పులుసు వండితే తన ఫ్రెండ్స్ లొట్టలు వేసుకొని మరి తినేవారట.. అలాంటి చేపల పులుసును హైదరాబాద్ వాసులకు అందించాలనే ఆలోచనతో ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది..

Advertisement

దీనిలో భాగంగానే కూకట్ పల్లి లో నెల్లూర్ పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ను మొదలుపెట్టారు.. ఈ కర్రీ పాయింట్ లో దొరికే ఐటమ్స్ ఏంటంటే.. బొమ్మిడాయిల పులుసు, చేపల పులుసు, కొర్రమీను పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు దొరుకుతాయట.. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ కర్రీస్ అన్నీ కట్టెల పొయ్యి మీదనే వండుతారట.. ఇవే కాకుండా హైదరాబాదులో 15 బ్రాంచ్ లు ఓపెన్ చేస్తానంటున్నాడట ఆర్పి.. మరి ఆయన ఈ బిజినెస్ రంగంలో విజయవంతం కావాలని మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ చేయండి.

ALSO READ:

Visitors Are Also Reading