Home » హోటల్‌ పెట్టుకున్న కిరాక్ ఆర్పీ..ఒక్క రోజుకు లక్షల్లో ఆదాయం..నెలకు ఎంతంటే ?

హోటల్‌ పెట్టుకున్న కిరాక్ ఆర్పీ..ఒక్క రోజుకు లక్షల్లో ఆదాయం..నెలకు ఎంతంటే ?

by Bunty
Ad

టాలీవుడ్‌ నటుడు కిరాక్ ఆర్పి గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి కర్రీ పాయింట్ బిజినెస్ మొదలుపెట్టాడు. కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు ఇలా అన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారట.

READ ALSO : లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?

Advertisement

అన్ని కలిసి వస్తే నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్ 15 బ్రాంచులు ఓపెన్ చేస్తానంటున్నాడు. ఆర్పి పదేళ్ల కిందటే దీని ప్రారంభించాలనుకున్నాడు. అతడు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. కిరాక్ ఆర్పి స్వస్థలం నెల్లూరు. అందుకే ఈ హోటల్ కు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ అనే పేరు పెట్టాడు. దీంతో సోషల్‌ మీడియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఫేమస్‌ అయింది.

Advertisement

అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా ఆర్పి బాగానే సంపాదిస్తున్నాడు. కిరాక్ ఆర్పి కి ఒక రోజుకు ఆదాయం 2 లక్షలు వస్తుందట. అంటే ఒక నెల ఆదాయం 60 లక్షలు. అలాగే అందులో పని చేసే వర్కర్లకు ఉచితంగా భోజనం సదుపాయం కల్పిస్తున్నాడట. అందరికీ ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడానికి సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిమీద వంట చేసి భోజనాన్ని అందిస్తున్నాడు. ప్రతిరోజు నెల్లూరు నుంచి చేపలను తీసుకువచ్చి వంటలు చేపిస్తున్నాడు. త్వరలోనే 15 కర్రి పాయింట్స్ పెడతాడట. హైదరాబాద్‌ లోని కొన్ని ప్రదేశాల్లో కర్రీ పాయింట్ కు పనులు జరుగుతున్నాయని ఓ ప్రముఖ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఆర్పీ.

READ ALSO : Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?

Visitors Are Also Reading