Home » ఈ రాజు దేశంతో పాటు త‌న ఫ్యామిలీకి కూడా సెప‌రేట్ బ‌డ్జెట్ ప్ర‌క‌టించుకుంటాడు!

ఈ రాజు దేశంతో పాటు త‌న ఫ్యామిలీకి కూడా సెప‌రేట్ బ‌డ్జెట్ ప్ర‌క‌టించుకుంటాడు!

by Azhar
Ad

1968 సెప్టెంబ‌ర్ 6న బ్రిటిష్ వారు తామ ఆధీనంలో ఉన్న స్వాజిలాండ్ అనే దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లారు. అప్ప‌టికే అక్క‌డ రాజుగా చెలామ‌ణి అవుతున్న కింగ్ సొభుజా 3 ఆ దేశ రాజ్యాంగాన్ని, పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసి ఆ దేశంలో రాజ‌రిక పాల‌న‌కు తెర‌లేపాడు. సొభుజాకు 70 మంది భార్య‌లు, 210 మంది పిల్ల‌లు ఉండేవారు. 1982లో అత‌ను చ‌నిపోయాక అత‌ని కొడుకు కింగ్ మ‌స్వ‌తి III రాజయ్యాడు.

Advertisement

Advertisement

ఇత‌డు జాతి సంప‌ద‌ను అనుభ‌వించ‌డంలో తండ్రిని మించిన‌వాడ‌య్యాడు. 15 మంది భార్య‌లను క‌లిగిన ఇత‌డు దేశ బ‌డ్జెట్ తో పాటు త‌న ఫ్యామిలీ కోసం కూడా సెప‌రేట్ బడ్జెట్ ప్ర‌క‌టించుకుంటాడు. చాలా విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతాడు.

ఇత‌ని కుటుంబానికి కేటాయించే బ‌డ్జెట్ అది 61 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపుగా రూ.456 కోట్లు) వ‌ర‌కు ఉంటుంది. ఇక ఈ రాజు ఆస్తి విలువ 200 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపుగా రూ.1497 కోట్లు) వ‌ర‌కు ఉంటుంది. ఇత‌నికి 210 మంది పిల్ల‌లు!

Visitors Are Also Reading