Home » ఐదేళ్ల లోపు పిల్లలకు పక్కా ఈ విషయాలను నేర్పాలి..!

ఐదేళ్ల లోపు పిల్లలకు పక్కా ఈ విషయాలను నేర్పాలి..!

by Sravanthi
Ad

చిన్నపిల్లలకి తల్లిదండ్రులు మంచి, చెడు నేర్పించాలి. ఐదేళ్లలోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్లకు ఈ విషయాలను నేర్పించండి. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లయితే కచ్చితంగా ఇవి తెలుసుకునేటట్టు చేయాలి. చిన్న వయసు వాళ్లకు పక్కా కొన్ని విషయాలని నేర్పించాలి. ఐదేళ్లలోపు వయసు వారికి పునాది లాంటిది. పునాది గట్టిగా ఉంటే లైఫ్ అంతా కూడా హాయిగా ఉండొచ్చు. హ్యాపీగా ఉంటుంది. ఇదే మంచి వయసు కాబట్టి కచ్చితంగా కొన్నిటిని పిల్లలకు నేర్పాలి.

Advertisement

పిల్లలకి చిన్న వయసులో గౌరవాన్ని నేర్పించాలి. గౌరవంగా పిల్లలు ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడూ మర్యాదగా గౌరవంగా ప్రవర్తించాలని వారికి నేర్పించండి. షేరింగ్ అలవాటు చేయాలి. షేరింగ్ చేస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా స్నేహాన్ని కొనసాగిస్తారు అందరితో షేరింగ్ చేసుకుంటారు. సామాజిక పరిస్థితులు ఎదుర్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు తమ భావాలను ఎలా వ్యక్తపరచాలో తల్లిదండ్రులు నేర్పాలి.

Advertisement

Also read:

కోపం, నిరాశ వంటివి ఎలా వ్యక్తపరచాలో వాళ్ళకి చెప్పండి. పిల్లలకి విద్యతో పాటుగా పరిశుభ్రత నేర్పించడం, భోజనానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవడం, టాయిలెట్ కి వెళ్లడానికి ముందు వెనుక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటివి పిల్లలకు అలవాటు చేయండి. అలాగే శుభ్రంగా పళ్ళను తోముకోవడం, స్నానం చేయడం వంటివి కూడా నేర్పాలి. మీరు మీ పిల్లలు చెప్పే మాటలు, సలహాలు వినేటట్టు వాళ్లను ప్రోత్సహించాలి. స్వీయ నిర్ణయం, సమయం ప్రాముఖ్యత కచ్చితంగా తెలపండి. పిల్లలకి ఆసక్తి కలిగేలా నేర్పించడం వారిని ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading