మనకున్న రెండు కిడ్నీలు మన శరీరంలో ఉండే ఐదు లీటర్ల రక్తాన్ని గంటకు రెండుసార్లు చొప్పున శుద్ధి చేసేసి ఆ రక్తంలో ఉండే ఎక్కువైనా వ్యర్ధాలను, లవణాలను, రసాయనాలను, హాని కలిగించే టాక్జాన్స్ ని వడగట్టి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. రెండు కిడ్నీలు ఆరోగ్యకరంగా పనిచేసేటప్పుడు మనకి వాటి విలువేంటో అర్థం కాదు. వాటిని పెద్దగా పట్టించుకోము. ఒకవేళ ఆ రెండు కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ లు , కిడ్నీ ట్రాన్స్ ప్లాన్టేషన్, హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చులు పెడతూ ఉంటాం. ఈ రోజుల్లో ఎంతో మందికి వయస్సు మీద పడకుండానే చెడిపోతున్నాయి. రెండు కిడ్నీలు పాడవడం వల్ల మనం చాలా రకాల ఇబ్బందులకు గురవుతారు.
డయాబెటిస్, హై బీపీ వల్ల కిడ్నీలు ఎక్కువగా చెడిపోతూ ఉంటాయి. ఇలా కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే.. సంవత్సరానికి ఒక్కసారైనా కిడ్నీలకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి.ముందుగా మూత్ర పరీక్ష చేయించుకోవాలి. యూరిన్లో ముందుగా ఆల్బుమిన్ అనే టెస్ట్ చేయించుకోవాలి. నిల్ అని టెస్ట్ లో వస్తే కిడ్నీలు బాగానే ఉన్నాయని అర్థం. కొంచెం ట్రేసెస్ లాగా వస్తున్నాయంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆల్బుమిన్ గనుక వన్ ప్లస్,టు ప్లస్ అని వస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతింటున్నాయని అర్థం.
Advertisement
Advertisement
ఒకవేళ ఆల్బుమిన్ టెస్ట్ లో వన్ ప్లస్,టు ప్లస్ గనుక వస్తే కొంచెం ఉప్పు మానేసి అలవాట్లు మార్చుకుంటే కిడ్నీలు మళ్ళీ నార్మల్ గా అవుతాయి. జిఎఫ్ఆర్ టెస్ట్ ను కూడా చేయించుకోవాలి. ఈ టెస్ట్ ఫిల్టర్ చేసే రేట్ ను తెలియజేస్తుంది.ఈ ఫిల్టరేషన్ రేట్ 90 ఉంటే కిడ్నీలు చాలా హెల్తీగా ఉన్నట్టు అర్థం. ఒకవేళ 60 లేక 70 ఉన్నట్లయితే బాగానే ఉన్నాయని అర్థం. ఒకవేళ 60 లోపు ఉన్నట్లయితే మీ కిడ్నీలు ఇబ్బంది పడుతున్నాయని అర్థం. 15 గనుక ఉంటే మీ కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని అర్థం. ఇలా సంవత్సరానికి ఒకసారి ఫిల్టరేషన్ రేటును కూడా చూసుకుంటూ ఉండాలి
ALSO READ;
ఆచార్యకు కొత్త చిక్కులు… ఆదుకోవాలంటూ చిరంజీవికి డిస్ట్రిబ్యూటర్ బహిరంగ లేఖ…!
కేజీఎఫ్-2 ప్రముఖ నటుడు మృతి.. ఎలా అంటే..!!