Home » రవి తేజ కిక్ సినిమా ని చేతులారా వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే ?

రవి తేజ కిక్ సినిమా ని చేతులారా వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌లో మ‌రో హీరో న‌టించి సూప‌ర్ హిట్ కొట్ట‌డం చాలా కామ‌న్. అలా చాలా సినిమాలు చేతులు మారాయి. కాగా ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. మాస్ మ‌హ‌రాజ్ కెరీర్ లోని బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో కిక్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. సినిమాలోని క్రేజీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేశాయి. సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

ఈ సినిమాకు వక్కంతం వంశీ క‌థ‌ను అందించారు. అయితే ఈ సినిమా క‌థ‌ను మొద‌ట ర‌వితేజకు వినిపించ‌లేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు ఈ సినిమా క‌థ‌ను మొద‌ట వినిపించారు. ఎన్టీఆర్ కు కూడా క‌థ న‌చ్చింది. సినిమా క‌థ డిఫ‌రెంట్ గా ఉంది ఇలాంటి స‌మ‌యంలో ఎక్పరిమెంట్స్ అవ‌స‌ర‌మా అనుకుని ఎన్టీఆర్ ఈ క‌థ‌ను ప‌క్క‌న పెట్టేశార‌ట‌.

Advertisement

ఆ త‌ర‌వాత ఇదే సినిమా క‌థ‌ను హీరో ప్ర‌భాస్ కు కూడా వినినింపించార‌ట‌. ప్ర‌భాస్ కు కూడా క‌థ న‌చ్చింది కానీ త‌న‌కు ఈ క‌థ సూట్ అవ్వ‌దేమో అని అనుమానం మొద‌లైంద‌ట‌. దాంతో ప్ర‌భాస్ కూడా ఈ సినిమా లో న‌టించేందుకు రిజెక్ట్ చేశాడు. ఇక చివ‌ర‌గా ఈ సినిమా క‌థ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ వ‌ద్ద‌కు వెళ్లింది. ర‌వితేజ‌కు ఉన్న కిక్కుకు ఈ సినిమా క‌థ చాలా భాగా సెట్ అవుతుంద‌ని అనుకున్నార‌ట‌.

ర‌వితేజ‌కు క‌థ వినిపించ‌గా ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. ఇక సినిమాలో విల‌న్ గా సురేంద‌ర్ రెడ్డి మొద‌ట జ‌గ‌ప‌తి బాబ‌ను అనుకున్నార‌ట‌. అయితే అదే స‌మ‌యంలో త‌మిళ న‌టుడు సామ్ స్టిల్స్ ను ఓ మ్యాగ‌జైన్ లో చూశాడ‌ట‌. ఆ స్టిల్స్ చూసిన‌వెంట‌నే కిక్ సినిమాలో విల‌న్ గా స‌రిపోతాడ‌ని అనిపిచిందట‌. ఇంకేముంది పిలిచి ఆయ‌న‌కు క‌థ వినిపించ‌గా వెంట‌నే ఓకే చెప్పాడు. అలా మొద‌లు పెట్టిన కిక్ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Visitors Are Also Reading