Home » ఇది నా కార్! ఈ ఫోటో ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్! అస‌లేంటి దీని స్టోరీ!

ఇది నా కార్! ఈ ఫోటో ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్! అస‌లేంటి దీని స్టోరీ!

by Azhar
Ad

ఇక్క‌డ క‌నిపిస్తున్న కార్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ కు చెందిన అభిషేక్ శర్మది. ప‌నిమీద అభిషేక్ త‌న కియా సెల్టోస్ SUV కార్ పై వెళుతుండ‌గా ఈ స్పీడ్ బ్రేకర్ లో ఇరుక్కుంది. దీన్నుండి త‌ప్పించేందుంకు దాదాపు గంట పాటు క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌ర‌కు తాళ్ళ‌తో లాగి వాహ‌నాన్ని ఈ స్పీడ్ బ్రేక‌ర్ నుండి బ‌య‌ట‌కు తీయాల్సి వ‌చ్చింది. స్పీడ్ బ్రేకర్ లో ఇరుక్కుపోయిన త‌న కార్ ను ఫోటో తీసి అభిషేక్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు. దానికి ‘మాస్టర్ పీస్ అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేస్తూ….ఈ స్పీడ్ బ్రేకర్‌ను తయారు చేసిన అద్భుతమైన ఇంజనీర్‌కు పెద్ద వందనం అంటూ ట్వీట్ చేశాడు. వాస్త‌వానికి ఇది ఒక మ్యాన్ హోల్ పై నిర్మించిన స్పీడ్ బ్రేక‌ర్. స్పీడ్ ను బ్రేక్ చేయాల్సిన స్పీడ్ బ్రేక‌ర్ కాస్త వెహిక‌ల్ ను బ్రేక్ చేసిందంటూ నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

Advertisement

Advertisement

కియా సెల్టోస్ గ్రౌండ్ క్లియరెన్స్ 190mm గా ఉంటుంది.వాస్త‌వానికి ఇది మంచి హైటే అయినా కార్ ఇరుక్కుందంటే ఆ స్పీడ్ బ్రేకర్ ఎంత హైట్ లో క‌ట్టారో అర్థంచేసుకోవొచ్చు. ప్రామాణిక స్పీడ్ బ్రేకర్లు గరిష్టంగా 10 సెం.మీ ఎత్తుతో, 3.7 మీటర్ల వెడ‌ల్పుతో గుండ్రని ఆకారాన్ని కలిగి ఉండాలి.స్పీడ్ బ్రేక‌ర్ల‌కు పెయింట్ వేయ‌డంతో పాటు రిఫ్లెక్టర్లను ఉంచాలి. కానీ చాలా చోట్ల స్పీడ్ బ్రేక‌ర్ల నిర్మాణంలో ఈ ప్ర‌మాణాల‌ను పాటించ‌డం లేదు. దీని కార‌ణంగా ప్ర‌తి యేడు దాదాపు 10,000 వేల మందికి పైగా యాక్సిడెంట్ల‌లో మ‌ర‌ణిస్తున్నార‌ని ఒక అంచనా, రాత్రి పూట హైవే ల్లో ఈ సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఫైన్ ల మీద చూపే ఇంట్ర‌స్ట్ స్పీడ్ బ్రేక‌ర్ల నిర్మాణాలు, సైన్ బోర్డ్ ల మీద చూపితే చాలా వ‌ర‌కు రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు.

Visitors Are Also Reading