Home » అంచనాలను పెంచుతున్న ఖిలాడి….విడుదలకు ముందే దర్శకుడికి రేంజ్ రోవర్ కారు…!

అంచనాలను పెంచుతున్న ఖిలాడి….విడుదలకు ముందే దర్శకుడికి రేంజ్ రోవర్ కారు…!

by AJAY
Ad

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఖిలాడీ కూడా ఒకటి. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి రవితేజకు హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ కూడా కీలక పాత్రలో నటించింది.

Khiladi

Khiladi

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 11 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇంకా విడుదల కాకుండానే నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మ కు కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. రమేష్ వర్మకు 1.15 కోట్ల విలువైన కారును నిర్మాత కోనేరు సత్యనారాయణ గిఫ్ట్ గా ఇచ్చారు.

Advertisement

Advertisement

raviteja

raviteja

సాధారణంగా సినిమా విడుదల తర్వాత లాభాలు వస్తే నిర్మాతలు దర్శకులకు నటీనటులకు గిఫ్ట్ లు ఇవ్వడం సహజమే. అయితే సినిమా విడుదలకు ముందు రమేష్ వర్మ కు నిర్మాత రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం తోనే నిర్మాత గిఫ్ట్ గా కారును ఇచ్చారని వార్త విన్న నెటిజన్లు అనుకుంటున్నారు.

Visitors Are Also Reading