కన్నడ సినిమా క్రేజ్ పెరగడానికి కారణం కేజీఎఫ్ సినిమా. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కేజీఎఫ్ మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా కేజిఎఫ్ సెకండ్ పార్ట్ ని కూడా థియేటర్లలో రిలీజ్ చేశారు. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లని రాబట్టింది. కర్ణాటక తో పాటుగా సౌత్, నార్త్ లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులని సృష్టించేసింది. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాకి అద్భుతంగా దర్శకత్వం వహించారు. హీరో యష్ కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.
Advertisement
ఈ సినిమాలో హీరోకి తల్లిగా ఒక అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో రాఖీ బాయ్ కి తల్లిగా నటించిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా..? అయితే తల్లిపాత్రలో అద్భుతంగా నటించిన ఆమె పేరు అర్చన జోస్ ఈమె బెంగళూరులో పుట్టారు. 1994లో అర్చన బెంగళూరులో జన్మించారట. అర్చన కర్ణాటకలోని బెంగళూరులో న్యూ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేశారు.
Advertisement
ఆ పాఠశాలలో నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథాకళిలో బ్యాచిలర్ డిగ్రీ ని తీసుకున్నారు అర్చన తమిళనాడులోని తంజావూర్ లోని శాస్త్ర విశ్వవిద్యాలయం ఫైనాన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. మహాదేవి అనే కన్నడ సీరియల్ లో మొదటిసారి ఈమె నటించారు. మహాదేవి సీరియల్ లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తర్వాత అర్చన కన్నడ చిత్రం కేజిఎఫ్ లో హీరో యష్ కి తల్లిగా నటించింది ఆమె వయసు 27 ఏళ్లు మాత్రమే. అద్భుతంగా నటించేసి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది అర్చన.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!