Home » చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమా కోసం కేజీఎఫ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్‌..!

చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమా కోసం కేజీఎఫ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్‌..!

by Anji
Ad

కేజీఎఫ్ సినిమాలో మొద‌టి మాదిరిగా రెండ‌వ చాప్ట‌ర్ కోసం ప్ర‌ముఖ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్లు అన్బారివ్ అందించిన ఫైట్స్ గురించి దేశ‌మంతా చ‌ర్చించుకుంటుంది. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 వ‌చ్చాక ఈ ఇద్ద‌రి పేరు మరింత‌గా మారుమ్రోగిపోతున్న విష‌యం తెలిసిన‌దే.

Advertisement

వాస్త‌వానికి అన్బారివు ప‌లు తెలుగుఏ సినిమాల‌కు స్టంట్ కొరియోగ్ర‌ఫీ అందించారు. గ‌తంలో అందులో ఒక‌టి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన 118 సినిమా కాగా.. మ‌రొక‌టి నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన ల‌క్ష్య అన్న‌ట్టు.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన నోటా సినిమాకు కూడా ఈ అన్బారివు స్టంట్ కొరియోగ్ర‌ఫీ అందించారు. తాజాగా ఈ ద్వ‌యం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాకు మైండ్ బ్లోయింగ్ డిజైన్ చేస్తున్నారు.

Advertisement

శంక‌ర్ సినిమాలో పాట‌ల‌కే కాదు. ఫైట్స్‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది.శంక‌ర్ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా రామ్‌చ‌ర‌ణ్ ఎన‌ర్జీకి త‌గ్గ‌ట్టుగా అన్బారివు ద్వ‌యం ఫైట్స్ కంపోజ్ చేస్తోంద‌ట‌. ఇటీవ‌ల త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్ సినిమాకు ఈ ద్వ‌యమే స్టంట్ కొరియోగ్ర‌ఫీ చేసింది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న స‌లార్ సినిమాకు కూడా అన్బుమ‌ణి అరివు మ‌ణి స్టంట్ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

  1. రాంచరణ్ గదిలోకి వచ్చిన కోతి.. ఆయన ఏం చేశారంటే..!!
  2. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి పై బండ్ల గణేష్ ఫైర్….నువ్వు ఆంధ్రాకు పట్టిన దరిద్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు …!
  3. అందాలతో అలరిస్తున్న సమంత.. చూస్తే చమటలు పట్టాల్సిందే..!!
Visitors Are Also Reading