దక్షిణ భారతదేశంలో తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత మళ్లీ అంత సంచలనం సృష్టించిన చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్ 2. తొలిపార్ట్ పెద్దహిట్ కావడంతో రెండవ పార్ట్ తెరకెక్కించారు మేకర్స్. కేజీఎఫ్ 2 సాధించిన విజయం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. కేజీఎఫ్ 2 చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజే రూ.130 కోట్ల కలెక్షన్లను సాధించి మొదటిరోజు రికార్డుల్లో మూడవస్థానంలో నిలిచింది. బాలీవుడ్ వారి సినిమాలను సైతం వెనక్కి నెట్ట టాప్ ప్లేస్‌లో నిలిచింది. యస్ నటన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు సినీ ప్రముఖులు సైతం జైజైలు కొడుతున్నారు.
Advertisement
ఇదిలా ఉండగా.. చాప్టర్ 2 చిత్రం ఎండింగ్ లో చాప్టర్ 3 ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ తరుణంలోనే కేజీఎఫ్ ఎగ్జిక్యూటవ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ చాప్టర్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఈ చిత్రంలో యష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించి ఒక్కసారిగా దేశం మొత్తం తనవైపు చూసేవిధంగా చేసుకున్న సంగీత దర్శకుడు రవి బస్సూర్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ మ్యూజిక్ దర్శకుడు కేజీఎఫ్ తో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు.
Advertisement
కరోనా లాక్‌డౌన్ సమయంలో రవి బస్సూర్ తన సొంత ఊరు ఉడిపి సమీపంలో కుందాపూర్ వెళ్లిపోయాడు. అక్కడ తన తండ్రితో పాటు దేవుళ్లకు ఆభరణాలు తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యాడు. తండ్రికి సాయం చేస్తూ దేవుళ్ల ఆభరణాలు తయారు చేశాడు. ఇందుకు అతనికి రోజుకు 35 రూపాయల సంపాదన వస్తుందట. కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడంటే..!!
- అందాల పోటీలకు ఎంపికైన రాజశేఖర్ కూతురు శివాని..!!
- సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార’ పాట పాడిన సింగర్ ఇండస్ట్రీ లో ఎదగకుండా తొక్కేసారా?