Home » “కేజీఎఫ్” లో పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన ఈ నటులు టీవీ సీరియల్స్ లో నటించారని తెలుసా…!

“కేజీఎఫ్” లో పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన ఈ నటులు టీవీ సీరియల్స్ లో నటించారని తెలుసా…!

by AJAY

సీరియల్స్ లో నటించిన వాళ్ళకి సినిమాల్లో చాలా అరుదుగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినా ఒకటి రెండు సినిమాల్లో తప్ప మళ్లీ అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. దాంతో చాలామంది సీరియల్ నటీనటులు పూర్తిగా సీరియల్స్ కే పరిమితమై పోతారు. కానీ అతి కొద్ది మంది నటీనటులు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటారు.

అలా సీరియల్ హీరో స్థాయి నుండి సినిమా హీరో స్థాయికి ఎదిగిన హీరో యష్. కెరీర్ ప్రారంభంలో కన్నడ సీరియల్స్ లో యష్ హీరోగా నటించాడు. యష్ నటించిన కొన్ని సీరియల్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో సినిమా అవకాశాలు అందుకున్నాడు. సినిమాల్లోనూ యష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా తో యష్ స్టార్ గా మారిపోయాడు.

అయితే కేజిఎఫ్ సినిమాలో నటించిన యష్ ఒక్కడు మాత్రమే సీరియల్స్ నుంచి రాలేదు. అతడితో పాటు సినిమాలో హీరో ఎలివేషన్స్ ఇచ్చే అనంత్ నాగ్ కూడా సీరియల్స్ లో నటించాడు. అదేవిధంగా కేజిఎఫ్ సినిమా లో ముఖ్యమైన పాత్రలో నటించిన అచ్యుత్ కుమార్ (గురు పండియాన్) కూడా గతంలో కన్నడ సీరియల్స్ నటించారు.

ఇక వీరందరూ కలిసి ఓ సీరియల్స్ నటించగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. దాంతో ఈ టీవీ సీరియల్ నటులతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Also read :

ఆ బిగ్ బాస్ బామ‌తో నాగార్జున ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సర్కారువారిపాట లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్…ఎక్కడంటే…?

Visitors Are Also Reading