కరోనా థర్డ్ ఫేస్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని అందించింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా మార్చిలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచి… కలెక్షన్ తో దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా అనంతరం వచ్చిన కేజిఎఫ్ 2 కూడా అంతకు మించిన విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు తెలుగు తమిళ కన్నడ భాషలతో సహా హిందీలో కూడా భారీ విజయాన్ని నమోదు చేశాయి.
Advertisement
అక్కడి సినిమాలే సాధించలేని రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకుని బాక్సాఫీస్ దగ్గర సౌత్ ఇండస్ట్రీ సినిమాల యొక్క సత్తాను చూపించాయి. ఈ రెండు సినిమాల దెబ్బకు చాలా బాలీవుడ్ సినిమాలు కనుమరుగైపోయే. అయితే ఈ రెండు సినిమాలలో ఆర్ఆర్ఆర్ కంటే కేజిఎఫ్ 2 కే అభిమానులు బ్రహ్మరథం పట్టారు అని తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విడుదలై క్రియేట్ చేసిన రికార్డులను ఆ తర్వాత విడుదలైన కేజిఎఫ్ రాకీ బాయ్ చెరిపేశాడు.
Advertisement
ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న 1,100 కోట్ల కలెక్షన్ దగ్గరే నిలిచిపోయింది. కేజిఎఫ్ 2 మాత్రం విడుదలైన నేటితో కేవలం 32 రోజులు పూర్తి చేసుకుని ఆర్ఆర్ఆర్ సాధ్యం కాని 1200 కోట్ల కలెక్షన్స్ ను సాధించి మరోసారి షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని… అవే ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేయడానికి సహాయపడ్డాయి అని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క థియేటర్ రన్ దాదాపు ముగిసిపోగా కేజిఎఫ్ 2 మాత్రం ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!
ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!