Home » గాడ్ ఫాదర్ ఓటీటీకి సంబంధించి కీలక విషయాలు ఇవే..!

గాడ్ ఫాదర్ ఓటీటీకి సంబంధించి కీలక విషయాలు ఇవే..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి- హనుమాన్ జంక్షన్ దర్శకుడు మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమెక్ గా వచ్చిన  గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన మేరకు రాలేదట.

Advertisement

ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ప్రారంభంలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ రాను రాను కలెక్షన్లు తగ్గిపోయాయి. ఆచార్య డిజాస్టర్ తరువాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ విడుదలవ్వడంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలై థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తరువాత ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.  

Advertisement

Also Read : ఘనంగా ఆలీ కుమార్తె పెళ్లి.. సందడి చేస్తున్న చిరంజీవి, నాగార్జున దంపతులు..!!

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకుంది. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. సునీల్, షపీ, అనసూయ, పూరి జగన్నాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ అమెజాన్ ప్రైమ్ లో మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ లో అందుబాటులో ఉంది. 

  Also Read :  చిరుతో అది చేసిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!!

Visitors Are Also Reading