Telugu News » Blog » ఢిల్లీకి గ‌వ‌ర్న‌ర్ అమిత్‌షాతో రేపు కీల‌క భేటీ..!

ఢిల్లీకి గ‌వ‌ర్న‌ర్ అమిత్‌షాతో రేపు కీల‌క భేటీ..!

by AJAY
Ads

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్యరాజ‌న్ ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. నిన్న‌నే రాష్ట్ర సీఎం కేసీఆర్ స‌తీస‌మేతంగా రాజ‌ధానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఒక‌వైపు ముఖ్య‌మంత్రి మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ ఇద్ద‌రూ ఢిల్లీకి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రేపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతార‌ని తెలుస్తోంది.


రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ హోంశాఖ‌కు ఇచ్చే రిపోర్ట్ కీల‌కంగా మార‌బోతుంది. మ‌రొక వైపు హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మీద ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌బోతున్న‌ట్టుగా స‌మాచారం ఉంది. రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ త‌రుణంలో గ‌వ‌ర్న‌ర్ సీఎం ఇద్ద‌రూ ఢిల్లీకి పోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళిసై వ‌చ్చిన తరువాత మొద‌ట్లో కొంత మంచి వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ త‌రువాత మాత్రం దూరం పెరిగింది. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


You may also like