Home » కెనరా బ్యాంకు కీలక నిర్ణయం.. కస్టమర్లకు ఝలక్..!

కెనరా బ్యాంకు కీలక నిర్ణయం.. కస్టమర్లకు ఝలక్..!

by Anji
Ad

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులలో ఒకటి అయినటువంటి కెనరా బ్యాంకు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి రుణ రేట్లు పెంచుతున్నట్టు తెలిపింది.  ఇక బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నెలవారి లోన్ ఈఎంఐ భారీగా పెరగనుంది. అదేవిధంగా  నూతనంగా లోన్ తీసుకోవాలనుకుంటే.. అధిక రుణ రేట్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

Advertisement

కెనరా బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆప్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రుణ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 07 నుంచి అమలులోకి వచ్చింది. రేట్ల పెంపు తరువాత చూస్తే ఓవర్ నైట్.. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా నమోదు అయింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతంగా ఉంది. ఈ ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరింది. కొత్త రేట్లు కొత్తగా తీసుకునే రుణాలకు వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. అదేవిదంగా రెన్యువల్, రీసెట డేట్ తరువాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. బ్యాంకు మళ్లీ సమీక్ష జరిపేంత వరకు కూడా ఈ రుణాల యొక్క రేట్లు అలాగే ఉంటాయని కెనరా బ్యాంకు పేర్కొంది. 

Advertisement

Also Read :  రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు

Manam News

 

సాధారణంగా బ్యాంకులు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును రుణాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. రేటును రిస్క్ ప్రీమియం, మార్జిన వంటివి కలుపుకొని రుణ రేట్లను నిర్ణయిస్తాయి. కెనరా బ్యాంకు బేస్ రేటు 8.95 శాతంగా ఉంది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 14.45 శాతంగా ఉన్నది. అదేవిధంగా బ్యాంకు షార్ట్ టర్మ్ రెపో లింక్ డ్ లెండింగ్ రేటు 6.25 శాతం ఉంది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు  6.25గా ఉంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వెళ్లడంతో బ్యాంకులు ఇదే దారిలో నడుస్తున్నాయి. రెపో రేటు పెరగడంతో రుణ రేట్లు పైకి కదులుతున్నాయి. బ్యాంకు రుణ గ్రహితలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నెలవారి ఈఎంఐ భారం పెరుగుతూ వస్తోంది. కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారు అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Also Read :  అదృష్టం అంటే ఇదే.. ఒక షేరుతో రూ. 50లక్షల లాభం..!

Visitors Are Also Reading