Home » పవన్ కళ్యాణ్ సినిమాలోకి రొమాంటిక్ బ్యూటీ…!

పవన్ కళ్యాణ్ సినిమాలోకి రొమాంటిక్ బ్యూటీ…!

by Azhar
Ad

తెలుగులో పవర్ స్టార్ పవాన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయాల కారణంగా సినిమాలకు రెండేళ్లు దూరమైన పవన్ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతా మళ్ళీ సినిమాలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఫాస్ట్ గా నాలుగు సినిమాలను ప్రకటించాడు పవన్. ఇప్పటీకే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అనే సినిమా విడుదల కాగా… ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు కూడా చేయనున్నాడు పవన్.

Advertisement

అందులో తమిళ రీమేక్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. ఇక ఈ సినిమాలో మెగా మీళుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ తో కలిసి నటించనున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో ఓ సినిమాతో పాటుగా పవన్ తో ఈ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

ఇక ఇందులోనే తేజ్ కు జంటగా… రొమాంటిక్ సినిమాలో నటించి మెప్పించిన కేతిక శర్మ కనిపించనుంది అని తెలుస్తుంది. రొమాంటిక్ లో ఆకాష్ పూరికి జంటగా కనిపించి మెప్పించిన కేతికకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఈ రీమేక్ సినిమాను కూడా తెలుగులో సముద్రఖని నే డైరెక్ట్ చేయనున్నాడు అని తెలుస్తుంది. మరి తెలుగులో కథను ఏమైనా మారుస్తారా.. లేక అలాగే తీస్తారా అనేది చూడాలి. అయితే ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు.

ఇవి కూడా చదవండి :

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

Visitors Are Also Reading