Home » ‘బీస్ట్’కు జోడిగా.. కీర్తి రియాక్షన్

‘బీస్ట్’కు జోడిగా.. కీర్తి రియాక్షన్

by Bunty
Ad

“తలపతి 66″తో తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాను ఆ ప్రాజెక్ట్‌పై సంతకం చేయలేదని పేర్కొంది. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్త సినిమాపై వస్తున్న పుకార్లను నటి కీర్తి సురేష్ ఖండించారు. విజయ్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మూవీకి, దర్శకుడు వంశీ పైడిపల్లి తదుపరి చిత్రానికి తాను సంతకం చేయలేదని చెప్పింది. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నారు. విజయ్ ఈ సినిమా షూటింగ్ మార్చి 2022లో ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ భైరవ, సర్కార్ చిత్రాల్లో నటించారు.

Advertisement

keerthy suresh

Advertisement

కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది. తాజాగా ఆమె చిరంజీవి ‘భోళా శంకర్‌’కి కూడా సంతకం చేసింది. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం “బీస్ట్” అనే తన రాబోయే భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నాడు. విజయ్ పుట్టిన రోజు జూన్ 22న ఈ సినిమా నుంచి అతని ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యింది. విజయ్ భారీ, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ఉన్న రెండు పోస్టర్‌లను మేకర్స్ ఆవిష్కరించారు. గోల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

Visitors Are Also Reading