Home » ముద్దుగుమ్మ మహానటికి వరుడు పిక్స్..ఇక సినిమాలు కష్టమేనా..?

ముద్దుగుమ్మ మహానటికి వరుడు పిక్స్..ఇక సినిమాలు కష్టమేనా..?

by Sravanthi

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది.. నేను “లోకల్ “నేను శైలజ” లాంటి చిత్రాలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మకు “మహానటి” సినిమా మాత్రం గొప్ప స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది.. అనేక సినిమాలు క్యూ కట్టాయి. దీంతో పాటు విమేన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటిస్తూ వచ్చింది. అంతేకాకుండా సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది..

also read:అలనాటి స్టార్ యాక్టర్ జగ్గయ్య మనవడు కూడా వెండి తెరపై నటిస్తున్నాడనే విషయం మీకు తెలుసా ?

అలాంటి ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.. అది ఏంటయ్యా అంటే కీర్తి సురేష్ పెళ్లిపై అనేక వార్తలు వస్తున్నాయి.. స్టార్ సెలబ్రిటీలు అంటే పెళ్లిపై రూమర్స్ రావడం సహజమే.. గత కొంతకాలంగా ఈ రూమర్స్ కీర్తి సురేష్ చుట్టూ తిరుగుతున్నాయి.. మహానటి పెళ్లికూతురు కాబోతోందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని కూడా ప్రచారం సాగుతోంది.. ఆమె తల్లిదండ్రులు వరుడిని ఫిక్స్ చేశారని, తల్లిదండ్రుల మాట కాదనలేక కీర్తి సురేష్ కూడా తల ఊపిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా కీర్తి సురేష్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పబోతోందని. తను వివాహంలోపు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తిచేసి ఇక సినిమాల వైపు చూడదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాకుండా వివాహం తర్వాత కీర్తి సురేష్ నిర్మాతగా మారబోతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ టీం స్పందించింది.. ఇందులో ఎలాంటి నిజం లేదని ఇవన్నీ పుకార్లే అంటూ కొట్టి పడేసింది.. ప్రస్తుతం కీర్తి సురేష్ మొత్తం సినిమాల పైన దృష్టి పెట్టిందని.. ఆమెకు పెళ్లి చేసుకునే వయసు అంతగా లేదని, మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే వయసు తక్కువగానే ఉందంటూ అంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దసరా సినిమా, అలాగే చిరంజీవి చెల్లెలి పాత్రలో బోలా శంకర్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా జయం రవి హీరోగా వస్తున్న సైరన్ మూవీలో కూడా కథానాయకగా చేస్తోంది.

also read:

Visitors Are Also Reading