తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్, కేటీఆర్ పైనే పడింది. ఎందుకంటే ఎన్నికల ముందువరకు ఒకటే చర్చ జరిగింది. ఈసారి హ్యాట్రిక్ కొడితే కెసిఆర్ సీఎం కావడం ఖాయం, కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం పక్క అని దాదాపుగా ప్రతి రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూశాక అంతా తారుమారు అయ్యింది.
Advertisement
అయితే ఇప్పుడు కూడా అంటే ఓడిపోయాక కూడా భవిష్యత్తు ప్రణాళిక ఆదిశగానే ఉండబోతుందని సమాచారం. విషయమేంటంటే ఈసారి కెసిఆర్ అసెంబ్లీలోకి రారట. దాని అర్థం జాతీయ రాజకీయాల్లో మరింత దృష్టి పెట్టబోతున్నారు. అందుకోసమే నాలుగు నెలల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచి జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
ఓ పక్క కేటీఆర్ ను రాష్ట్రంలో మెయిన్ లీడర్ ను చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎలాగంటే… ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాబోయే బీఆర్ఎస్ కు కేటీఆర్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారని సమాచారం. ఆ రకంగా కేసీఆర్ ఢిల్లీలో రాష్ట్రంలో పార్టీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ఎల్పీ లీడర్ గా కేటీఆర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందో. ఈ మార్పు గురించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుందో చూడాలి.