Home » కేంద్రంపై కేసీఆర్ సీరియ‌స్‌.. 21 టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

కేంద్రంపై కేసీఆర్ సీరియ‌స్‌.. 21 టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

by Anji
Ad

కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్య‌మించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ త‌రుణంలో 21న సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శాస‌న ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించనున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఈ స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్య‌క్షుడు, జ‌డ్పీ చైర్మ‌న్లు, డీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్య‌క్షులు, రైతుబంధు స‌మితుల జిల్లా అధ్య‌క్షులు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీఎం చేస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి వ‌రి ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం క‌చ్చితంగా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నా స‌మావేశం అనంత‌రం సీఎం, మంత్రుల బృందం ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, ప్ర‌ధానిని క‌లిసి డిమాండ్ చేయ‌నున్నారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా.. శ‌నివారం అందుబాటులో ఉన్న మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాటు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎర్రబెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ స‌మావేశం నిర్వ‌హించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా ఉన్న క్ర‌మంలో ఎలాంటి ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా ఇలా భేటీ కావ‌డం చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది. ముఖ్యమంత్రితో భేటీకి రావాలని ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లినట్టుగా స‌మాచారం. అక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు.

Visitors Are Also Reading