Home » దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ.. గుర్తు,పేరు ఏంటంటే..?

దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ.. గుర్తు,పేరు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొన్ని నెలల నుంచి కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు.. పాన్ ఇండియా లెవల్లో పార్టీ పెట్టేందుకు సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన అనేక మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, సామాజిక వేత్తలు, ఇతర నాయకులతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.. అయితే జాతీయ పార్టీగా టీఆర్ఎస్ పేరునే ప్రకటించాలని ప్రతిపాదనలు వచ్చాయి కానీ, కెసిఆర్ మాత్రం కొత్త పేరుతో పార్టీ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.. దీనికోసమే ఆయన మంత్రులు, జిల్లా అధ్యక్షులతో ప్రగతిభవన్లో భేటీ కాబోతున్నారు.

Advertisement

also read;పెళ్లి స‌మ‌యంలో ఎన్టీఆర్ అన్ని కోట్ల క‌ట్నం తీసుకున్నారా..? వ‌య‌సు విష‌యం ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే..?

Advertisement

ఈ భేటీలో కొత్త పార్టీ జెండా, అజెండా పై ప్రధానంగా చర్చించనున్నారు.. అలాగే దసరా లోపు ఈ చర్చలన్నీ పూర్తి చేసి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పూర్తి సహకారం తో కెసిఆర్ దసరా రోజు పార్టీ పేరు,జెండాను ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త పార్టీ పేరు కూడా టిఆర్ఎస్ ను పోలి ఉన్నా, బిఆర్ఎస్ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం . దాదాపుగా ఇదే పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి గుర్తుగా కారు నిర్మించబోతున్నట్లు సమాచారం. అలాగే జెండా రంగు కూడా గులాబీ రంగులోనే ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆలోచనను పథకం ప్రకారం ముందుకు తీసుకుపోతున్నారని తెలుస్తోంది.

అయితే తెలంగాణలోని సంక్షేమ పథకాలైన మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలను దేశవ్యాప్తంగా తీసుకురావాలని కెసిఆర్ భావించినట్లు తెలుస్తోంది.. అయితే టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సమయంలో ఆయన కొత్త హెలికాప్టర్ ను ప్రారంభించారు. అయితే దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ లో పార్టీని స్థాపించిన తర్వాత కొత్త ఫ్లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయనకు పార్టీలు ప్రారంభించిన తర్వాత హెలికాప్టర్ వినియోగం బాగా కలిసొస్తుందని నమ్ముతారు.

also read:నిజమేనా:పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ షూస్ ధరతో సామాన్యుడి జీవితం సెట్ అయిపోద్ది..!!

Visitors Are Also Reading